పెళ్ళికి ముందే చక్కటి జీవితానికి అద్భుతమైన ప్రణాళిక!

భార్యాభర్తలు ఆనందంగా బ్రతకడానికి ఖరీదైన బిల్డింగ్స్, ఏసీ రూమ్స్,బ్యాంక్ బ్యాలెన్స్ ఇవున్నా లేకున్నా రెండక్షరాల ప్రేమ ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ రెండక్షరాల ప్రేమతో పాటు డబ్బుకూడా అవసరం. తమకు నచ్చిన అర్ధాంగిని జీవితంలోకి ఆహ్వానించినప్పుడు వారిని కష్టపెట్టకుండా ఉండాలంటే పెళ్లికి ముందే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. లేదంటే జీవితంలో అనుకోని ఇన్సిడెంట్స్ ను ఫేస్ చేయడం చాలా కష్టం. కాబట్టి ప్రతీ ఒక్కరు ముఖ్యంగా కాబోయే నూతన వధూవరులకు ఫైనాన్షియల్ అవసరం.

పెళ్లికి ముందే వధువరులూ తమ అభిప్రాయాల్ని పంచుకునే సమయంలో ఆర్ధిక అవసరాల గురించి కూడా చర్చించుకోవాలి. ఈ టెక్ యుగంలో పిల్లల భవిష్యత్ బాగుండాలంటే పెళ్లి తరువాత ఇద్దరు భార్యభర్తలు తప్పని సరిగ్గా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పెళ్లికి ముందే ఎవరి శాలరీ ఎంత..? ఎవరి శాలరీని ఖర్చు పెట్టాలి…? ఎవరి శాలరీలో ఎంత సేవింగ్స్ చేయాలో నిర్ణయించుకోవాలి. తద్వారా ఆర్ధిక సమస్యల నుంచి బయటపడొచ్చు.

పెళ్లితరువాత గుళ్లుగోపురాలు, హనీమూన్ టూర్లు ఉంటాయ్. అందుకే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా సంబంధిత టూర్ వివరాలు, హోటల్స్ తో పాటు ట్రావెలింగ్ విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. పెళ్లైన కొత్తలో ఖర్చు గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా రీజనబుల్ ప్రైస్ లో టూర్ ట్రావెల్, హోటల్స్ గురించి తెలుసుకొని ప్లాన్ చేసుకోవాలి.
పెళ్లికి ముందే కాబోయే దంపతులు ఒకరి ఆర్ధిక విషయాల గురించి మరొకరు తప్పని సరిగా తెలుసుకోవాలి.

ఒకవేళ ఆర్ధిక ఇబ్బందులుంటే అందుకు తగ్గట్లుగా ఖర్చు చేసుకోవచ్చు. ఇక క్రెడిట్ కార్డ్ లను ఎలా వినియోగించుకోవాలి. ఎంత వినియోగించుకుంటే మనకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవు సంబంధిత వివరాల గురించి తెలుసుకొని నిజాయితీ మెలగాలి. పెళ్లికి ముందే ఇల్లు, లోన్స్ తో పాటు ఇతర సేవింగ్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెళ్లికి ముందే పర్సనల్ లోన్లు, హౌస్ లోన్లు లేకుండా చూసుకుంటేనే మంచిది. అలా ఉంటే పెళ్లి తరువాత ఆ ఆనందాన్ని పొందలేం. జీవితాంతం ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది.

SHARE