ట్రెండింగ్

Telangana Job’s: ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెడీ అవుతున్న అభ్యర్థులకు.. గుడ్ న్యూస్.. చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!!

Share

Telangana Job’s: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి భారీగా నోటిఫికేషన్ లు కెసిఆర్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైద్య, విద్యా రంగాలతో పాటు పోలీసు శాఖలో ఇంకా అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులు… చాలావరకు కోచింగ్ సెంటర్ లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

For the candidates who are getting ready for government jobs .. Good news .. said the Telangana government

అయితే ఈ సమస్యను అధిగమించే తరహాలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెడీ అవుతున్న అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. వాళ్లపై ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతో.. కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున.. శాసన సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు.

For the candidates who are getting ready for government jobs .. Good news .. said the Telangana government

ఇటీవల మాసబ్ ట్యాంక్ వద్ద త్వరలో అమలు చేయబోయే “మనబస్తి మనబడి” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అభ్యర్థికి నెలకు ఐదు వేల రూపాయలు అందిస్తామని.. పేర్కొన్నారు. ఒక బ్యాచ్ కి 100 మంది చొప్పున మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ సెంటర్ లో శిక్షణ నిర్వహిస్తామని తలసాని చెప్పుకొచ్చారు. ఇక ఇవే శిక్షణ తరగతులు కుదిరితే రాష్ట్రవ్యాప్తంగా మిగతా జిల్లాలలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 80 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ లు విడుదల చేయడంతో పాటు ఇప్పుడు శిక్షణ తరగతులకు కేసీఆర్ నడుం బిగించడం పట్ల తెలంగాణ నిరుద్యోగ యువత ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.


Share

Related posts

Nani – Nirupam: నాని హీరో అవడానికి కారణం డాక్టర్ బాబేనా..!?

bharani jella

Intinti Gruhalakshmi: ఈ ట్విస్ట్ తో సీరియల్ కథ మొత్తం మారిపోనుందా..!? ఇంటింటి గృహలక్ష్మి ఆదివారం స్పెషల్..

bharani jella

Weight Loss: ఇవి తింటే బరువు తగ్గడం ఖాయం..!! ట్రై చేస్తే రిజల్ట్స్ గ్యారెంటీ..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar