Shweta Sharda: ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఫైనల్స్ మరికొద్ది గంటలలో ప్రారంభం కానున్నాయి. మిస్ యూనివర్స్ టైటిల్ కోసం ఈసారి ఏకంగా 90 దేశాలకు పైగా అందగత్తెలు పోటీ పడుతున్నాయి. ఇండియా నుండి శ్వేత శారద అనే మోడల్ పోటీలో ఉంది. 2021 తర్వాత ఇండియా నుంచి మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఇండియాకు చెందిన మోడల్ ఫైనల్ కీ వెళ్ళడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో గురువారం జరిగిన నేషనల్ కాస్టింగ్ షోలో శ్వేతా శారద తన కాస్ట్యూమ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. 2021లో హర్నాజ్ సంధు కిరీటాన్ని గెలుచుకోగా భారత్ నుంచి తొలిసారి సుస్మితాసేన్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. కాగా ఇప్పుడు చండీగఢ్ కి చెందిన శ్వేతా శారద భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఉత్కంఠదా నెలకొంది.
మరికొద్ది గంటల్లో ఎల్ సాల్వడార్ లో జరిగే మిస్ యునివర్స్ ఫైనల్ కాంపిటేషన్ లో విజేతను ప్రకటించనున్నారు. దీంతో శ్వేత శారద వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే… ఎన్నో విషాదకరమైన సంగతులు, ఒంటరి పోరాటాలు ఉన్నాయి. 2000 సంవత్సరం మే 24న శ్వేతా శారద జన్మదినం. పుట్టినప్పుడే తండ్రి లేకపోవడంతో చిన్నతనం నుండి తల్లి సంరక్షణలోనే పెరిగింది. ఈ క్రమంలో సమాజంలో ఎన్నో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనీ తనని తాను కాపాడుకుంటూ తల్లి సహకారంతో ముందడుగుతో 16 ఏళ్ళ వయసులో చండీగఢ్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత ఢిల్లీలో గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేయడం జరిగింది. అనంతరం మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. అదే సమయంలో డాన్స్ దివానే, డాన్స్ ప్లస్, డాన్స్ ఇండియా డాన్స్ వంటి రియాల్టీ షోస్ లో.. ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది.
అందంతో పాటు డాన్స్ టాలెంట్ కలిగిన శ్వేతా శారద “ఝలక్ దిక్లా జాకీ” అనే సినిమాకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత గత కొద్ది నెలల నుండి మోడలింగ్ రంగంలో పలు అందాల పోటీలలో వరుస పెట్టి పాల్గొంటూ ఉంది. గత ఆగస్టు నెలలో మిస్ యూనివర్స్ ఇండియా 2023 పోటీలో పాల్గొని అందాల కిరీటాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో పాల్గొన్నేందుకు అర్హత సొంతం చేసుకుంది. ఆ సమయంలో తన తల్లి తన జీవితంలో తన ఎదుగుదలకు ప్రధాన కారణం అని… ఎమోషనల్ అయ్యింది. తనకి ఇష్టమైన బాలీవుడ్ నటీనటులకు ముఖ్యంగా దీపికా పదుకొనే, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఇంకా పలువురితో పనిచేయటం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో శ్వేతా శారద ఫైనల్ కి చేరుకోవటంతో.. ఆమె గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు. గతంలో మిస్ యూనివర్స్ టైటిల్ కిరీటాన్ని సుస్మితాసేన్, లారా దత్త, హర్నాజ్ కౌర్ సాధించారు.