Galli Sampath : రాజేంద్ర ప్రసాద్.. తెలుగు ఇండస్ట్రీలో ఈయనకు ఉన్న ఇమేజ్ గురించి.. ఈ పేరుకున్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..!! అప్పటివరకు తెలుగు కమెడియన్లు అని సపరేట్ గా ఉండే వాళ్ళు.. కానీ రాజేంద్రప్రసాద్ వచ్చిన తర్వాత కామెడీ హీరోలు వచ్చారు..!! సినిమాల్లో ఎక్కడో ఒక చోట కామెడీ కాకుండా సినిమా అంతా కామెడీ తోనే నడిపించడం అంటే చిన్న విషయం కాదు..! కానీ దాన్ని ఎన్నో సినిమాల్లో చేసి చూపించాడు రాజేంద్రప్రసాద్..!! అందుకే ఆయన నటకిరీటి అయ్యాడు..!! ఇప్పటికి సినిమాలు చేస్తూనే బిజీగా ఉన్నాడు రాజేంద్రప్రసాద్.. మొన్న క్లైమాక్స్ సినిమాతో వచ్చాడు.. ఇప్పుడు గాలి సంపత్ అంటూ వచ్చేస్తున్నాడు..!! ఈయన పైనే ఒక సినిమా కథ రాసి నిర్మాతగా ఉండి.. స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాడు సంచలన దర్శకుడు అనిల్ రావిపూడి.. మార్చి 11న మహ శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..!
బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంపత్.. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో రామ్ హాజరైయ్యారు.. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ – మా స్రవంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయిందే రాజేంద్రప్రసాద్ గారి లేడీస్ టైలర్ సినిమా తో.. ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు హ్యాపీగా నవ్వుకోవచ్చు.. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చాలా చిన్నగా కనపడుతుంది..! అని అన్నారు. అలాగే గాలి సంపత్ సినిమాకి రాజేంద్రప్రసాద్ గారికి నేషనల్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను..! ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూడగానే ఇది తప్పకుండా అవార్డ్ గెలిచే సినిమా అనిపించిందని రామ్ అన్నారు.
గాలి సంపత్ సినిమా ట్రైలర్ లో ఆయన నటన అద్భుతంగా ఉంది. ఫు.. ఫ.. ఫఫా.. అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ కి కుడుప్పబ్బా నవ్వలిసిందే.. ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.. ఈ సినిమా లో రాజేంద్రప్రసాద్ యాక్టింగ్ చూడాలంటే రేపటి వరుకు ఆగాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!