Subscribe for notification

Gama Pehlwan: ఒంటి చేత్తో ఏనుగును ఎత్తిన… అంతర్జాతీయ కుస్తీ వీరుడు గామా పహిల్వాన్ స్టోరీ..!!

Share

గూగుల్ డూడుల్‌గా గామా పహిల్వాన్: Google Doodle features Gama Pehlwan

ప్రపంచంలో కుస్తీ పోటీలలో భారత్ కి మొదటి నుండి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ముఖ్యంగా కుస్తీ వీరుడు గామా పహిల్వాన్ (Gama Pehlwan).. ఒకానొక టైంలో భారత ప్రాంతానికి చెందిన కుస్తీ వీరుడిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేటు చేశాడు. ప్రపంచంలో ఎంతటి వీరుడు, శురుడు అయినా..గామా పహిల్వాన్ ముందు తల వంచాల్సిందే అన్నరీతిలో కుస్తీ పోటీలలో రాణించాడు.

బ్రిటిష్ హయాంలో తిరుగులేని కుస్తీ ఆటగాడిగా పేరొందిన గామా పహిల్వాన్ 22 మే 1878లో అమృత్సర్ లో జన్మించాడు. గామా పహిల్వాన్ అసలు పేరు గులాం మహమ్మద్ బక్ష్. ఇతని కుటుంబం కాశ్మీర్ నుండి పంజాబ్ కి వలస వచ్చింది. ఇతని కుటుంబ నేపథ్యం మొదటి నుండి పహిల్వాన్ లోనే. దీంతో వంశపారంపర్యంగా వచ్చిన భారీ ఆకారం గామా పహిల్వాన్ కి సొంతం.

Gama Pehlwan full story in Telugu

 

Who is Gama Pehlwan?  గామా పహిల్వాన్ ఎవరు?


చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుండి అనేక ఇబ్బందులు గామా పహిల్వాన్ ఎదుర్కొంటూ వచ్చాడు. ఆరేళ్ల వయస్సులోనే తండ్రి చనిపోవడంతో.. చిన్ననాటి లోనే తినడానికి కూడా తిండి ఉండేది కాదు. తల్లి కూడా లేదు. ఆ సమయంలోనే తాత చేరదీయడం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే తాత మరణించడంతో గామా పహిల్వాన్ పూర్తిగా ఒంటరివాడైపోయాడు. అయితే ఈ సమయంలో గామా పహిల్వాన్ లో బలాన్ని గమనించిన మేనమామ… కుస్తీ పోటీలకు వెళ్లాలని సలహా ఇవ్వటం జరుగుద్ది.

Gama Pehlwan full story: గామా పహిల్వాన్

10 సంవత్సరాల వయసులో గ్రామంలో జరిగిన కుస్తీ పోటీలో గామా పాల్గొని.. ఓడిపోతాడు. దీంతో మేనమామ గామా పహిల్వాన్ కి మంచిగా తిండిపెట్టి కుస్తీ పోటీలకి సరిగ్గా తయారయ్యేలా అతని బాగోగులు దగ్గరుండి చూసుకుంటాడు. ఆ తర్వాత జోధ్ పూర్ లో జరిగిన కుస్తీ పోటీలలో గామా పహిల్వాన్ తన సత్తా చాటుతాడు. దీంతో గామా ప్రతిభకు ముగ్ధుడైన జోధ్ పూర్ దొర తన దగ్గర ఉన్న పహిల్వాన్ లతో గామాకి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించడం… జరుగుతుంది. అదే సమయంలో మంచి పోషకాహారం కూడా గామాకి దొర పెట్టిస్తాడు.

Google celebrates Gama Pehlwan

ఆ రీతిగా సహాయం లభించడంతో కుస్తీ పోటీలలో గామా అన్ని మెలకువలు నేర్చుకుంటాడు. మంచి ఆహారం లభించడంతో 15 సంవత్సరాలకే 25 సంవత్సరాల కుర్రవాడిగా గామా తయారవ్వుతాడు. జోధ్ పూర్ దొర శిక్షణ ఇప్పించడంతో అతని తరపున పోటీలోకి దిగి గామా గెలుస్తూ వచ్చేవాడు. దీంతో తక్కువ కాలంలోనే గామా పేరు ఎక్కడ చూసిన మారుమ్రోగుది. అయితే ఇదే సమయంలో జోధ్ పూర్ దొర గామాకి తిండి పెట్టలేక చేతులెత్తేస్తాడు. అయితే ఆ సమయంలో దాటియా మహారాజు గామా గురించి తెలుసుకుని.. అతని చేరదీసి.. మొత్తం సంరక్షణ చూసుకుంటాడు.

దీంతో మనోడు 24 సంవత్సరాలకే ఒంటిచేత్తో ఏనుగును లేపి నట్లు అప్పట్లో టాక్ ఉండేది. ఈ సంఘటనతో అప్పటిదాకా గామాగా ఉన్న అతను ప్రపంచానికి ది గ్రేట్ గామా గా.. పరిచయం కావటం జరిగిందట. 1910 లో ఇండియన్ హెవీ వెయిట్ చాంపియన్ గా బ్రిటిష్ ప్రభుత్వం గామా నీ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఇండియాని పరిపాలిస్తున్న బ్రిటిష్ రాణి గడ్డ బ్రిటన్ లో అంతర్జాతీయ కుస్తీ పోటీలలో… ఆ గడ్డపై అక్కడి వాళ్ళని ఓడించాలని గామా పోటీకి దిగుతాడు. కానీ వెయిట్ ఎక్కువ కావడంతో… పోటీ నుండి అతని తప్పించడం జరుగుతోంది. ఆ సమయంలో గామా… బ్రిటిష్ రాణి సొంత గడ్డ కుస్తీ పోటీ దారులకు సవాలు చేసి తనతో కుస్తీకి పోటీకి రమ్మనీ సవాల్ విసురుతాడు. ఓడిపోతే ప్రైజ్ మనీ నేనే ఇస్తాను అంటూ చాలెంజ్ విసురుతాడు.

  Google celebrates the undefeated Indian wrestler Gama Pehlwan

ఆ సమయంలో భారీ కుస్తీ పోటీ దారుడు… గామా తో పోటీకి దిగుతాడు. అతన్ని ఓడిచేస్తాడు. ఆ తర్వాత పది మంది పోటీదారులను.. ఒంటి చేత్తో గామా ఓడిస్తాడు. ఆ తర్వాత అంతర్జాతీయ కుస్తీ పోటీలలో అనేక టోర్నమెంట్లలో గెలుస్తూ… వచ్చిన గామా.. దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ కి మకాం మారుస్తాడు. ఆ సమయంలో ఇండియాలో పెళ్లి చేసుకున్న భార్యను వదిలేసి పాకిస్తాన్ లో ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుద్ది.

అనంతరం గామా అనారోగ్యం పాలు కావడంతో పాటు మెడిసిన్ కొనుక్కోడానికి కూడా డబ్బులు లేక పోవడంతో గామా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు. ఆ సమయంలో ఇండియాలో బిర్లా సహాయం చేయడం మాత్రమే కాదు ఇండియాకి వచ్చేయాలని గామానీ కోరడం జరుగుతుంది. కానీ గామా.. ఇండియా రావటానికి ఇష్టపడడు. అనంతరం అనారోగ్యంతో గామా మరణించడం జరుగుతుంది.


Share
Siva Prasad

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

6 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

1 hour ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago