బిగ్బాస్ ఇంటిలో మొదటినుండి గంగవ్వ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అన్నారు. ఆమె వయసుకు అందజేస్తున్న మర్యాద, తన లేటు వయసులో సాధించిన ఘనత అందుకు కారణం. అయితే గంగవ్వ లోపలికి వెళ్ళిన తర్వాత సర్దుకునేందుకు కొద్దిగా టైం తీసుకుంది కానీ ఎప్పుడు అయితే స్పందించాలో అప్పుడు సరిగ్గా మాట్లాడింది. ఇలా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ బాగా ఊపు లో దూసుకుపోతున్న గంగవ్వ కు నిన్న టాస్క్ తెగ నచ్చేసినట్లు ఉంది.
సండే ఫన్ డే లో భాగంగా ఇంటిలో జంబలకిడిపంబ స్కిట్ ప్రదర్శించారు. ఆడవాళ్ళు మగవాళ్ళుగా…. మగవాళ్ళు ఆడవాళ్ళుగా వేషాలతో అలరించారు. ఇదే సమయంలో గంగవ్వ.. గంగూగా, కుమార్ సాయి కుమారి గా నటించారు. వారిద్దరూ ఒక పాటకి డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మామూలుగానే గంగవ్వ నెలరోజులుగా తనదైన శైలిలో రాణిస్తోంది. ఇంటిలో తనకు నచ్చింది నచ్చినట్లు మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇంటి సభ్యులతో ఎలాంటి మొహమాటం లేకుండా అందరి స్వభావాలు చెప్పేస్తుంది.
ఇక ఆదివారం జరిగిన జంబలకడిపంబ స్కిట్ లో తన పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకర్షించారు. హెయిర్ కట్ తో గడ్డం మీసాలు పెట్టుకొని అదరగొట్టింది. అసలు ముత్యాలు వస్తావా అంటూ అల్లు రామలింగయ్య గారి డాన్స్ చేసి సాయి కుమార్ సైతం ఆశ్చర్యపోయేలా స్టెప్పులేసింది. డ్యాన్స్ కు అనుకూలంగా హావభావాలు కూడా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. కుమార్ సాయి కూడా గంగమ్మ ఊపును తట్టుకోలేకపోయాడు.
ఇదే సమయంలో కుమార్ సాయి కట్టుకున్న చీర ఊడిపోయింది. అయినా డాన్స్ చేయడంలో నిమగ్నమయ్యాడు. గంగవ్వ ఉన్న ఊపు అలాంటిది మరి. వెంట వెంటనే అమ్మరాజశేఖర్ స్టేజిపైకి ఎక్కి కుమార్ సాయి వేసుకున్న చీర సరి చేయడంతో మరింత ఉత్సాహంతో సాయి డాన్స్ చేశాడు. అంతే…. ఇంటి సభ్యులు అంతా స్టెప్పులకు ఊర మాస్ విజిల్స్ వేసి ఎంకరేజ్ చేశారు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?