ట్రెండింగ్

Pushpa: “పుష్ప” గురించి అప్పట్లో గరికపాటి చేసిన కామెంట్స్ తాజాగా నిజమయ్యాయి..!!

Share

Pushpa: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన పుష్ప ఘన విజయం సాధించడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. గత ఏడాది డిసెంబర్ లో విడుదల చేశారు. విడుదలైన ప్రతి చోట సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. “పుష్ప”లో అల్లు అర్జున్ మేకోవర్.. డైలాగులు.. స్టెప్పులు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా క్రేజ్ దక్కించుకోవడం జరిగింది. “పుష్ప” లో బన్నీ డైలాగులను చాలా మంది సెలబ్రెటీలు, ఇంటర్నేషనల్ క్రికెటర్లు సోషల్ మీడియాలో.. తమదైన శైలిలో పలికి వైరల్ అయ్యారు. Watch: Jahangirpuri riots accused Ansar makes Pushpa 'Jhukega Nahin' signature move while being taken to court

ఇదిలా ఉంటే అప్పట్లో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు “పుష్ప” సినిమా పై సీరియస్ కావడం తెలిసిందే. స్మగ్లర్ నీ హీరోగా చూపించటం దారుణమని కామెంట్లు చేశారు. అంతేకాదు “పుష్ప” సినిమా హీరో గాని డైరెక్టర్ గాని… తనకు సమాధానం చెప్పాలని కనబడితే కడిగేస్తాను.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. ఇటువంటి సినిమాల వల్ల సమాజం పాడవదా అని కూడా ప్రశ్నించారు. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా..? అదొక ఉపనిషత్తు సూక్తి అయిపోయింది ప్రస్తుత రోజుల్లో. ఇప్పుడు కుర్రాళ్ళు బయట ఎవరినైనా ఒకరినీ చంప మీద కొట్టి తగ్గేదేలే అనే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరు అని గరికపాటి అప్పట్లో “పుష్ప” పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. Jahangirpuri Violence: Riots accused preforms 'Pushpa' signature move while being taken to courtసరిగ్గా ఇప్పుడు అదే తరహాలో ఒక నేరస్తుడు పైగా పోలీసుల అదుపులో ఉండగానే మీడియా ముందు తగ్గేదేలే ఫోజ్ ఇచ్చాడు. పూర్తి విషయంలోకి వెళితే హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఢిల్లీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్లో ఒకరిని రోహిణి జిల్లా కోర్టుకి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. దాడులకు సంబంధించి ప్రధాన కుట్రదారులో ఒకడైన ఈ నిందితుడు.. ఢిల్లీ పోలీస్ అధికారుల ముందు.. మీడియా ముందే .. “పుష్ప”లో బన్నీ మాదిరిగా తగ్గేదేలే స్టిల్ ఇచ్చాడు. అతని ముఖంలో పశ్చాతాపం గాని పోలీసుల భయంగానే అస్సలు కనిపించలేదు నవ్వుతూ ఉన్నాడు. ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో.. అప్పట్లో గరికిపాటి నరసింహారావు “పుష్ప” పై చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది సమాజంలో అసలు మంచి అనేది కరువైపోయింది అని.. అందువల్లే..స్టోరీలో ..కబ్జాలు.. నేరాలు చేసే హీరోల సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.


Share

Related posts

Devatha Serial: మాధవ్ మనసులో రాధ పై ఇన్ని అనుమానాలు ఉన్నాయా..!? రాధ ఏం చేసిందంటే..!

bharani jella

Bariatric: ఈ ఆపరేషన్ చేయించుకుంటే స్లిమ్ అవుతారట..!

bharani jella

Job Notification: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2021 నోటిఫికేషన్.. భారీగా ఖాళీలు..

bharani jella