Garlic Milk: వెల్లుల్లి పాలు ఇలా తాగితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు..!!

Share

Garlic Milk: వెల్లుల్లి వాసన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.. దాంతో ఇది కూరలకు మంచి రుచిని అందిస్తుంది. వెల్లుల్లి లో విష పదార్దాలని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ క్రిములను హరించే యాంటీ మైక్రోబయల్, విష పదార్దాలను బయటకు పంపే యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి.. వీటిని పాలలో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. వెల్లుల్లి ని పాలతోనా అనుకుంటున్నారా.. ఇప్పటివరకు మిరియాల పాలు.. పసుపు పాలు గురించి విని ఉంటారు.. ఇప్పుడు వెల్లుల్లి పాలు గురించి తెలుసుకుందాం.. వెల్లుల్లి పాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోయారు..!!

Garlic Milk: for health and skin benefits
Garlic Milk: for health and skin benefits

Garlic Milk: వెల్లుల్లి పాలు తయారీ విధానం:

పాలు – ఒక కప్పు , వెల్లుల్లి – 4 రెబ్బలు, తేనే – 2 స్పూన్లు. ముందు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసి ముక్కలు చేసుకోవాలి. పాలలో వెల్లుల్లి రెబ్బలను వేసి 10 నిముషాలు మరిగించాలి. మరిగించిన పాలను గ్లాసు లోకి పోసి తేనే కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న వెల్లుల్లి పాలలో ఫ్లెవనాయిడ్స్, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి.విటమిన్ ఏ, బి1, బి2, బి6, సి, పొటాషియం, ప్రోటీన్స్, కాపర్, మాంగనీస్, పాస్ఫరస్, జింక్, సెలీనియం, క్యాల్షియం వంటి అనేక పోషకాలు ఈ పాల ద్వారా మనకు లభిస్తాయి..

Garlic Milk: for health and skin benefits
Garlic Milk: for health and skin benefits

Garlic Milk: వెల్లుల్లి పాలను ఇలా తాగండి..!!

వెల్లుల్లి పాలను ప్రతి రోజు తాగటం వలన ఎముకలు దృడంగా మారతాయి. ఎముకలు విరిగిన వారికి ఈ మిశ్రమం తాగిస్తే అవి త్వరగా అత్తుకుంటాయి. దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. దంత సమస్యలు రాకుండా చేస్తుంది. మెటబాలిజం రేటును పెంచుంది. అధిక బరువు తో బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. వెల్లుల్లి పాలు ప్రతి రోజు తాగితే త్వరగా బరువు తగ్గుతారు. రక్త నాళ్ళల్లో పేరుకుపోయిన కొవ్వను కరిగిస్తుంది. ఈ పాలు రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే యాంటీబయాటిక్ గుణాలు గాయాలు, పుండ్లు అయితే అవి త్వరగా తగ్గేలా చేస్తుంది. ఈ పాలు అధిక రక్తపోటు నియంత్రణ లో ఉంచుంది. డయాబెటిక్ లెవెల్స్ ను కంట్రోల్ లోకి తీసుకొస్తుంది. లివర్ శుభ్రపడేలా చేస్తుంది. వివిధ రకాల క్యాన్సర్ లను నయం చేసే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. క్యాన్సర్ కణతుల పెరుగుదల తగ్గిస్తుంది. ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్లెట్లెట్స్ తగ్గిన వారికి ఇది వరంగా చెప్పుకోవచ్చు.

ఇది జ్వరంగా కారణంగా పడిపోయిన ప్లేట్ లెట్స్ ను వేగంగా పెంచుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది. ఆయుర్వేద వైద్య ప్రకారం, వెల్లుల్లి పాలు తాగితే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వలన మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఈ పాలలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను తొలగించి నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపులో మంట తగ్గుతుంది. పాలిచ్చే తల్లులకు పాలు రాక ఇబ్బంది పడుతుంటే వెల్లుల్లి పాలు తాగితే పాలు పడతాయి. ఈ మిశ్రమం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.


Share

Related posts

రక్తహీనత, ఊబకాయానికి చక్కటి పరిష్కార మార్గం ఇదే..!

Teja

విరాట్ మరియు అనుష్క ల బేబీ కోసం వెయిట్ చేస్తున్న వరల్డ్ వైడ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్!!

Naina

Monal Gajjar New Gallerys

Gallery Desk