Girls: పూర్వకాలంలో ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి పుట్టింది అని తెగ సంతోష పడేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ బాలికల కోసం ప్రతిదీ ఖర్చు పెట్టాల్సిన నేపథ్యంలో ఆడపిల్ల అంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా వారి విద్య, పెళ్లికి చాలా ఖర్చు అవుతోంది. అలాంటి తల్లిదండ్రుల కోసమే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం మీ అమ్మాయిల విద్యా ,పెళ్లిళ్లకు చాలా సహాయకారిగా పనిచేస్తుంది.

ప్రస్తుత ఒక కుటుంబంలో 2 సుకన్య ఖాతాలను తెరిచేందుకు అనుమతించింది. కుమార్తెలకు 15 యేళ్ళు నిండేంత వరకు ఇందులో డబ్బు పొదుపు చేయవచ్చు. మరి ఈ పథకం లో ఎలా ఇన్వెష్ట్ చేయాలో చూద్దాం..
సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం ఖాతా తెరిచిన 15 ఏళ్ల వరకు ఇందులో డబ్బు డిపాజిట్ చేయవచ్చు. పదేళ్లలోపు వయసున్న బాలికల పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవచ్చు.. ఉదాహరణకు బాలికకు 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఖాతా తెరిస్తే 24 ఏళ్ల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 15 సంవత్సరాలు డబ్బులు జమ చేయాలి. అలాగే 21 యేళ్ళకు ఖాతా మెచ్యూర్ అవుతుంది. 9 ఏళ్ల వయసులో తెరిస్తే ఆమెకు 30 యేళ్ళు నిండాకే మెచ్యూరిటీ వస్తుంది.
మీరు ఈ ఖాతాను ముందుగానే ముగించాలనుకుంటే ఖాతాదారుని వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అది కూడా ఆమె పెళ్లి కోసమే.. డబ్బు అవసరమని ధ్రువీకరించాలి. పెళ్లికి నెల రోజులు లేదా మూడు నెలల ముందు మాత్రమే విత్ డ్రా చేసుకొని అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకం ఆడపిల్ల భవిష్యత్తుకు బంగారు పునాది వేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.