Amazon prime: అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇక టీవీలతో పనిలేదు!

Share

Amazon prime:అమెజాన్.. ప్రస్తుతం పాపులారిటీ వున్న OTTలలో ఇది కూడా ఒకటి. భారత్ లో అత్యధికంగా వాడుతున్న ప్లాట్ ఫామ్ ఇదే అని తాజా గణాంకాలు చెబుతున్నాయి. మిలియన్ల కొద్దీ యూజర్స్ అమెజాన్ సొంతం. పెరుగుతున్న పాపులారిటీకి తగ్గట్టే అమెజాన్ యాజమాన్యం ఎప్పటికప్పుడు దీన్ని యూజర్లకు అనుగుణంగా అప్ డేట్ చేస్తూ ఉంటుంది. ఇపుడు తాజాగా ఓ అప్ డేట్ తెస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.

Amazon: అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేందుకు చూస్తున్నారా..?అయితే త్వరపడండి లేదంటే అంతే..!

ఇంతకీ ఏమిటి ఆ ఫీచర్?

ఇక్కడ దాదాపు యువత అందరూ క్రీడల పట్ల మంచి ఆసక్తి కలిగి వుంటారు. అందులోనూ ముఖ్యంగా క్రికెట్ అంటే పడిచస్తారు. ఇక ఇక్కడ క్రికెట్ బెట్టింగులకైతే కొదువే ఉండదు. కొన్ని కోట్ల రూపాయలలో ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ఇల్లీగల్ గానే. సరే.. అదంతా ఇప్పుడు అప్రస్తుతం. అయితే ఈ ఉత్సాహాన్ని గమనించిన సదరు అమెజాన్ యాజమాన్యం అతి త్వరలో క్రికెట్ అభిమానుల కోసం అదిరిపోయే ఫీచర్ ను అందిస్తోంది. అవును… ఇపుడు మీరు క్రికెట్ చూడటం కోసం టీవీలకు అతుక్కోవలసిన పనిలేదు. మీ ఫోన్ లోనుండే ఎంచక్కా లైవ్ షోస్ ను చూసేయచ్చు.

Rajamouli: బాహుబలి 3 గురించి నోరు జారిన జక్కన్న!
ఎప్పటినుండి చూడవచ్చు?

వచ్చే సంవత్సరం అనగా, 2022 జనవరి 1 నుంచి 13వ తేదీ వరకు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో లైవ్ స్టీమ్ కానుంది. ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ , ఇంగ్లండ్ లాంటి జట్లతో స్వదేశంలో ఆస్ట్రేలియా ఆడనుంది. ఇలా న్యూజిలాండ్లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించే అవకాశం తన కస్టమర్లకు కల్పించింది. దాంతో అమెజాన్ యూజర్స్ పండగ చేసుకుంటున్నారు.


Share

Related posts

Police Constable: కరోనా కష్టకాలంలో మానవత్వం చాటిన కానిస్టేబుల్..!!

bharani jella

‘కార్తీకదీపం’ ఫేమ్ హిమ ఇంత షాక్ ఇచ్చేసింది ఏంటి? ఈ పిల్ల అసలు స్వరూపం చూడండి

arun kanna

Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత స్టేటస్..!!

sekhar