NewsOrbit
Google Doodle న్యూస్

Maria Telkes: నేడు ప్రముఖ సౌర శక్తి శాస్త్రవేత్త “సన్ క్వీన్” మరియా టెల్కెస్ జయంతి..గూగుల్ స్పెషల్ గౌరవార్థం..!!

Maria Telkes Google Doodle Video: ప్రముఖ సౌర శక్తి శాస్త్రవేత్త మరియా టెల్కెస్ గౌరవార్థం గూగుల్ యానిమేటెడ్ డూడల్ లో ఆమె లోగోను ఆవిష్కరించారు. మారియా టెల్కేస్‌ 1900 డిసెంబర్ 12 హంగేరీ లోని బుడాపెస్ట్ లో జన్మించడం జరిగింది. 1924లో బుడాపెస్ట్ విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగం నందు విద్యను కొనసాగించి పీహెచ్.డీ పొందుకోవటం జరిగింది. అనంతరం అమెరికాలో బంధువుల ఇంటికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత తన చదువును అక్కడ కొనసాగించి బయో ఫిజిక్స్ మరియు జీవులచే సృష్టించబడిన శక్తి పరిశోధనలలో.. అనేక పరిశోధనలు చేయడం జరిగింది. ఆ రీతిగా ఆమె ఆసక్తి వేడినీ.. శక్తిగా మార్చడానికి మార్గాలను కనుగొనే దిశగా.. చదువు కొనసాగించింది. ఈ సమయంలో అమెరికా పౌరసత్వం కూడా సంపాదించింది.

Google honours Hungarian scientist 'Sun Queen' Maria Telkes on her birth anniversary
Google honours Hungarian scientist ‘Sun Queen’ Maria Telkes on her birth anniversary

ఈ దిశగా మరియా టెల్కెస్ పరిశోధనలు కొనసాగుతూ 1939 సౌరశక్తిపై దృష్టి పరిశోధనలు జరుపుతున్న MIT రీసెర్చ్ బృందంలో చేరింది. సౌర శక్తి పరిశోధనలకు సంబంధించి.. అనేక ఫలితాలు రాబట్టి మంచి నైపుణ్యారాలుగా పేరు సంపాదించింది. అనంతరం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రభుత్వ శాస్త్రీయ పరిశోధన ఇంకా అభివృద్ధి కార్యాలయంలో సౌరశక్తికి సంబంధించి సాంకేతికత కోసం వినూత్న ఆలోచనల విషయంలో మారియా టెల్కేస్‌ కి పదవి లభించింది. అమెరికా సైనిక విభాగాలలో మారియా టెల్కేస్‌ అందించిన పరిశోధనల ఫలితాలు ఎంతగానో మేలు చేశాయి. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే దిశగా.. సోలార్ డిస్టిల్ వాటర్ గా మరియా టెక్స్ పరిశోధనలు సత్ఫలితాలు ఇచ్చి సముద్రంలో యుద్ధం చేసే అమెరికా సైనికులకు దాహం తీర్చేలా చేశాయి. ఈ క్రమంలో MIT పరిశోధన బృందం ఆమె ఎదుగుదలను ఓర్వలేక ఆమెను దెబ్బతీయటానికి అనేక ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అయినా కానీ మరియా టెక్స్ ఎక్కడ వెనుకడుగు వేయకుండా… తన పరిశోధనలను కొనసాగించడం విశేషం.

Science history: All hail the Sun Queen

ఈ రీతిగా సోలార్ పరిశోధనలో ఆమె పేరు మారుమ్రోగుతున్న టైములో 1948లో ఓ ప్రముఖ ద్రాతృత్వవేత్త అందించిన నిధులతో సూర్యకాంతి యొక్క వేడిని గోడల మధ్య ఒక ప్రత్యేక పదార్థం లోకి ప్రసారం చేసే వ్యవస్థను రూపొందించింది. ఈ రీతిగా గోడల మధ్య నిల్వచేయబడిన శక్తిని వేడిగా విడుదల చేసే రీతిలో… శీతాకాలంలో చలిగా ఉన్న ఇళ్లను వేడిగా మార్చే దిశగా డోవర్ సన్ హౌస్ లను నిర్మించడం జరిగింది. ఇక 1953లో MIT బృందం నుండి బయటకు వచ్చేసి న్యూయార్క్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో సౌర శక్తి పరిశోధనల విషయంలో మరింత ముందడుగు వేసి.. సౌరశక్తి ద్వారా పనిచేసే ఓవెన్ నీ కనిపెట్టింది. మరియా టెక్స్ కనిపెట్టిన ఓవెన్ ఆమెకు ఎంతగానో పేరు తీసుకొచ్చింది.

మరియా టెల్కెస్
మరియా టెల్కెస్

ఈ పరిశోధనతో ఫోర్డ్ ఫౌండేషన్ నుండి ఆమెకు గ్రాంట్ కూడా ఇవ్వబడింది.ఈ ఓవెన్ ద్వారా.. ఇళ్లల్లో మాత్రమే కాదు అమెరికా రైతులకి బాగా ఉపయోగపడింది. ఇప్పటికి కూడా ఈ ఓవెన్ లు వాడుకలో ఉన్నాయి. ఫోర్డ్ ఫౌండేషన్ తో కలిపి ఆమె పరిశోధనలు కొనసాగించి దాదాపు.. సోలార్ కంపెనీలకు సంబంధించి 20 కంపెనీలను ప్రారంభించడం జరిగింది. సోలార్ ఎనర్జీ ద్వారా మరియా టెక్స్ చేసిన పరిశోధనలకు వచ్చిన ఫలితాలకు ఆమెకు “సన్ క్వీన్” అనే బిరుదు కూడా రావటం జరిగింది. అంతేకాదు 1952లో ప్రపంచంలో సొసైటీ ఆఫ్ ఉమెన్ ఇంజనీర్స్ అచీవ్మెంట్ అవార్డు పొందిన మొదట మహిళగా మారియా టెల్కేస్‌ హిస్టరీ సృష్టించారు. నేడు ఆమె జయంతి కావటంతో గూగుల్ ప్రత్యేకంగా ఆమెను సత్కరిస్తూ ఉంది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!