ట్రెండింగ్ న్యూస్ సినిమా

Gully Rowdy: గల్లీ రౌడీ “చాంగురే” మాస్ సాంగ్ అదుర్స్..!!

Share

Gully Rowdy: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం గల్లీ రౌడీ..!! ఈ చిత్రం నుండి “పుట్టినే ప్రేమ” పాటను విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా నుంచి “చాంగురే” ఐటమ్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్..!! చాంగురే ఫుల్ వీడియో లిరికల్ సాంగ్ ను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జూలై 21న విడుదల చేయనున్నారు..!!

Gully Rowdy: Changure Item song promo out now
Gully Rowdy: Changure Item song promo out now

 

ఈ పాటను మంగలి, దత్తు కలసి ఆలపించారు.. ఈ చిత్రానికి సాయిరాం రామ్ మిరియాల సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో కు మంచి స్పందన వస్తోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు.. ఈ సినిమాను కోనవెంకట్ సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్, ఎంవివి ఫిలిమ్స్ పతాకంపై ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

Gully Rowdy: Changure Item song promo out now
Gully Rowdy: Changure Item song promo out now

ఈ చిత్రంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన మాస్ సాంగ్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.


Share

Related posts

కీర్తి సురేష్ మిస్ ఇండియా మీద అవన్ని అవాస్తవాలే ..?

GRK

Bommu Lakshmi Half Saree Images

Gallery Desk

ఐఐటీ నోటిఫికేషన్.. వివరాలివే..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar