ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Kalyan Ram: కళ్యాణ్ రామ్ బర్త్డే స్పెషల్ “డెవిల్” ఫస్ట్ లుక్ సూపర్బ్ అంతే..!!

Share

HBD Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ వరుస సినిమా అప్డేట్ రచ్చ రచ్చ చేస్తున్నాడు.. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ఈసారి వరుసగా ఐదు సినిమా ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు.. ఇప్పటికే కళ్యాణ్ రామ్ 18 వ సినిమా బింబిసార నుంచి అప్ డేట్ వచ్చేసింది.. ఇక 19వ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు.. అలాగే 20 చిత్రాన్ని ఎస్ వి సి బ్యానర్ పై గుహన్ రూపొందిస్తున్నారు.. తాజాగా 21వ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది..!! నేడు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు..!! ఈ సందర్భంగా కళ్యాణ్ 21వ సినిమా “డెవిల్” టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్..!!

HBD Kalyan Ram: devil title teaser out
HBD Kalyan Ram: devil title teaser out

తాజాగా విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.. డెవిల్ కి “ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్” అనేది ట్యాగ్ లైన్..!! ఈ సినిమాకు నవీన్ మేడారం అ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దేవాన్ష్ మామ సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. 1945 కాలం మద్రాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలను ఏర్పడేలా చేసింది.. కళ్యాణ్ రామ్ కెరియర్లో 22వ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మొత్తానికి కళ్యాణ్ పుట్టిన రోజున వరుసగా ఐదు సినిమాలు నుంచి అప్డేట్స్ వచ్చాయి.. ఈసారి ఎలాగైనా కళ్యాణ్ రామ్ హిట్ కొడతారని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు.


Share

Related posts

విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జి విషయంలో చంద్రబాబు సరికొత్త ఎత్తుగడలు..!!

sekhar

Radhe shyam: అభిమానులే అతిథులు..డార్లింగ్ ఊహించని గిఫ్ట్..ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

GRK

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని అరెస్టు చేయాలి

Srikanth A