ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Manisharma: మణిశర్మ బర్త్ డే స్పెషల్ నారప్ప సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల..!!

Share

HBD Manisharma: మణిశర్మ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. దశాబ్దంపాటు గా తెలుగు ప్రేక్షకులను తన మెలోడీ లతో అలరిస్తూనే ఉన్నారు.. ముఖ్యంగా చిరంజీవి సినిమాలకు ఈయన అందించే సంగీతం మరో రేంజ్ లో ఉంటుంది.. చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో పాటలు సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో మణిశర్మ కు మంచి గుర్తింపు వచ్చింది దీంతో వరుస సినిమా ఆఫర్లను అందుకున్నారు మణిశర్మ ప్రత్యేకతలలో ముందుగా చెప్పుకోవాల్సింది మెలోడీలు.. మణిశర్మ చేసిన మెలోడీలు చాలా అద్భుతంగా ఉంటాయి అందుకే ఆయనకు మెలోడీ బ్రహ్మ అని పేరు.. అలాగే ఆయన నా వీణపై చేసే ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నేడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు..!! ఈ సందర్భంగా నారప్ప సినిమా నుంచి “చలాకీ చిన్నమ్మాయి” మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్..!!

HBD Manisharma: special Narappa movie Chalaki Chinnamai lyrical video song out
HBD Manisharma: special Narappa movie Chalaki Chinnamai lyrical video song out

విక్టరీ వెంకటేష్ ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం నారప్ప..!! శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ సంగీతం అందించిన చలాకీ చిన్నమ్మాయి పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. ఓటిటి లో విడుదల అంటూ వార్తాకథనాలు వినిపిస్తున్నప్పటికీ.. కరోనా తీవ్రత తగ్గాక థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు..

 

ప్రస్తుతం మణిశర్మ చేతిలో పది సినిమాలు ఉన్నాయి.. నిన్న సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాలోని గాన ఆఫ్ రిపబ్లిక్ ఈ పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. అలాగే చిరంజీవి నటిస్తున్న ఆచార్య కు కూడా మణి శర్మ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే శ్రీదేవి సోడా సెంటర్, శాకుంతలం, నితిన్, విజయ్ దేవరకొండ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.


Share

Related posts

Head Bath: తలస్నానం చేయడానికి చల్లటి నీళ్లా లేక వేడినీళ్లు బెస్టా..!?

bharani jella

Aliya Bhat: ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ ఈమేదే..!!

bharani jella

Balakrishna: ఆ డబ్బును చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చేయాలని బాలయ్యబాబు డిసైడ్..??

sekhar