HBD Ram Pothineni: దేవదాసు సినిమాతో సినీ అరంగేట్రం చేసిన రామ్..! తన డాన్స్ , డైలాగులు తో దుమ్మురేపుతూ తన తరం హీరోల కంటే ముందు వరుసలో నిల్చొని.. తనదైన ఎనర్జీ ప్రూవ్ చేసుకుంటూ.. ఎనర్జిటిక్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల చేత పిలిపించుకుంటున్నాడు..!! ఈరోజు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజు..!! ఈ సందర్భంగా విడుదల చేసిన సిడిపి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!
రామ్ హీరోగా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు.. 2006 లో తన కెరీర్ ప్రారంభించిన చాక్లెట్ బాయ్.. ఇప్పటివరకు 18 చిత్రాల్లో నటించిన రామ్ ఉత్తమ నటుడిగా 3 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు.. ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగారు.. ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ ఇస్మార్ట్ కుర్రాడు..
రీసెంట్ గా రెడ్ సినిమాతో హిట్ అందుకున్న రామ్.. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్.6 గా తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. రామ్ పోతినేని కెరీర్లో 19వ చిత్రంగా ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రూపొందుతోంది.. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా లింగుస్వామి ట్రేడ్ మార్క్ తో చిత్రంగా ఉండబోతోంది భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.