HBD Sai Kumar: డైలాగ్ కింగ్ సాయి కుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నే కాకుండా తండ్రిగా.. విలన్ గా.. హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.. పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ చెప్పిన కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్.. అని చెప్పిన సాయికుమార్ డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది.. అంతలా తన డైలాగులతో ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.. నేడు డైలాగ్ కింగ్ సాయికుమార్ పుట్టినరోజు..!! ఈ సందర్భంగా తాను నటిస్తున్న వన్ బై టూ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్..!!
HBD Sai Kumar: One By Two movie teaser out
లవ్ చేయాలంటే నమ్మకం కలిగించాలి ఎలాగైనా ఒప్పించాలి అంతేకానీ.. యాసిడ్ పోస్తాను అంటావా.. అంటూ టీజర్ మొదలవుతుంది.. పోయండిరా.. రేయ్ సౌండ్ చేయకురా.. నో స్మోకింగ్ కదా.. మూడేళ్ళ పాప రా.. ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తాను.. నేను ఎంటర్ అయితే విశ్వరూపమే అంటూ ఈ టీజర్ ముగుస్తుంది.. సాయికుమార్ డైలాగ్స్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. శివ ఏటూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా వన్ బై టూ చిత్రం రూపొందుతోంది.. చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లెండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
నేడు సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ నటులు, ప్రముఖులు, అభిమానులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.. సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ఎస్ ఆర్ కళ్యాణమండపం నుంచి ప్రత్యేక పోస్టర్, గ్లింప్స్ విడుదల చేశారు.. ఈచిత్రం ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదల కానుంది..