HBD Sreemukhi: శ్రీముఖి యాంకర్ మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో టాప్ ర్యాంకర్.. తనదైన యాంకరింగ్ తో అభిమానుల మనసులకు బేడీలు వేసింది.. తన ఫటాఫట్ పంచులతో.. ధనా ధన్ డైలాగులతో యూత్ ఫిదా చేసింది.. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా చక్రం తిప్పుతోంది ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి పుట్టినరోజు..!! ఈ సందర్భంగా ఆమె అభిమానులు శ్రీముఖి బర్త్ డే సిడిపి ని విడుదల చేశారు..!! ఈ సిడిపి నెట్టింట వైరల్ అవుతుంది..!!
శ్రీముఖి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా అరుదు.. ఒకప్పుడు యాంకరింగ్ అంటే సుమ.. సుమ అంటే యాంకరింగ్ అనే వారు ఇప్పుడు ఆ జాబితాలోకి శ్రీముఖి వచ్చేసింది.. తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కిస్తూ..తన అల్లరితో యాంకరింగ్ చేయడంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది యాంకర్ శ్రీముఖి.. పటాస్ షోలో యాంకరింగ్ చేస్తూ బాగా ఫేమస్ అయిన శ్రీముఖి..
బుల్లితెర రాములమ్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.. ఒకవైపు బుల్లితెరపై రాణిస్తూనే.. మరోవైపు జులాయి సినిమా తో వెండితెరపై కాలు మోపింది.. శ్రీముఖి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ, బాబు బాగా బిజీ, క్రేజీ అంకుల్స్ లాంటి సినిమాల్లో నటించింది.. ఇటీవలే బిగ్ బాస్ 3 లో పాల్గొన్న శ్రీముఖి రన్నరప్ గా నిలిచి తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంది.. ప్రస్తుతం పలు సోషల్ యాంకరింగ్ చేస్తూ, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రీముఖి.