Ivy Guard Leaves: గ్రీన్ వెజిటేబుల్స్ లో దొండకాయ కూడా ఒకటి.. దీనిని ఫ్రై చేసుకుని తిన్న, కూరలా వండుకుని తిన్నా రుచికరంగా ఉంటుంది.. రుచికి రుచి తో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.. దొండకాయలలో బోలెడు పోషకవిలువలు ఉన్నాయి.. దొండకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే.. అయితే దొండకాయ ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని మీకు తెలుసా.. ఈ ఆకులు అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది.. వాటి గురించి తెలుసుకుందాం..!!
ప్రతిరోజు 30 గ్రాముల దొండకాయ ఆకుల రసాన్ని తాగడం వలన మధుమేహం శాశ్వతంగా తగ్గిపోతుంది.. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లకు కూడా ఇది చెక్ పెడుతుంది. గజ్జి లాంటి చర్మ వ్యాధులకు దొండకాయ ఆకులను పేస్టులా తయారు చేసుకుని చర్మంపై పూతలా రాసుకోవాలి. ఇలా చేస్తే త్వరగా గజ్జి, తామర, దురద తగ్గుతుంది. దీనిలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు దోహదపడతాయి. దొండకాయ ఆకుల రసం, ఆవాల పొడి, వెల్లుల్లి రసం కలిపి ఉండ లాగా తయారు చేసుకోవాలి. ప్రతి రోజు ఈ ఉండ ను నీటిలో కలిపి తీసుకోవడం వలన స్త్రీలలో రుతూక్రమం సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. దొండకాయ ఆకులు రసం లో గేదె పెరుగు కలుపుకోవాలి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కామెర్లు తగ్గుతాయి. కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.
దొండకాయ ఆకులను, నల్ల ఉమ్మెత్త ఆకులను, చిక్కుడు ఆకులను సమానంగా తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి మెత్తగా నూరుకోని రసం తీయాలి. ఇలా తీసుకున్న రసాన్ని అరికాళ్లకు రాసుకోవాలి. ఇలా చేయడం వలన వచ్చే అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. అరికాళ్ళ మంటలు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.. దొండకాయ ఆకుల రసాన్ని తీసి ముఖంపై రాసుకోవడం వల్ల ముఖం పై ఉన్న మొటిమల తాలూకు మచ్చలు మొత్తం పోయి కాంతివంతంగా చేస్తుంది. ఈ ఆకులు గర్భిణీ స్త్రీలకు చక్కటి పోషకాహారం గా చెప్పవచ్చు.