Setting On Floor: నేలపై కూర్చొని భోజనం చేయకపోతే బరువు పెరుగుతారా..!?

Share

Setting On Floor: ఇప్పుడంటే డైనింగ్ టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్నాము కానీ.. ఒకప్పుడు ఇంట్లో అందరు నెల పై ఒక దగ్గర కూర్చుని భోజనం చేసేవారు.. ఈ రోజుల్లో నేల పై కూర్చుని భోజనం చేస్తే నామోషీగా ఫీల్ అవుతున్నారు కానీ.. నేల పై కూర్చుని భోజనం చేస్తే ఆరోగ్యమట..!! నేల పై కూర్చుని తినకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదట..!!

health Benefits Of Setting On Floor: Eating
health Benefits Of Setting On Floor: Eating

నేలపై కూర్చుని భోజనం చేయడం వలన పద్మాసనం భంగిమ వస్తుంది. దీని వలన కండరాలు, కీళ్ల, నడుము నొప్పులు తగ్గుతాయి. పైగా నెలపై ప్రశాంతంగా కూర్చుని భోజనం చేస్తే అన్నం తిన్న భావన కలుగుతుంది. కూర్చుని నిదానంగా భోజనం చేస్తేనే కడుపు నిండిన భావన కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చాలా సేపటి వరకు ఆకలిగా లేదని మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. నేలపై కూర్చుంటే వెన్నుపూస నిటారుగా ఉంటుంది. ఇది మెదడుకు సమాచారం సులభంగా చేరుతుంది. దీంతో పొట్ట నిండిన విషయాన్ని మెదడు గుర్తించి ఇక చాలు వద్దు అని చెప్పేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఇంకా రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

health Benefits Of Setting On Floor: Eating
health Benefits Of Setting On Floor: Eating

అలా కాకుండా పని చేసుకుంటూ, హడావుడిగా తింటే తృప్తి కలుగక పోవడం తో పాటు కాసేపటికే ఆకలి ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఆ తర్వాత ఎక్కువగా తినే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దీని వలన బరువు పెరగడం తోపాటు ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే పెద్దలు నేలపై కూర్చుని భోజనం చేయమంటారు.


Share

Related posts

పున్నమి ఘాట్‌లో మతమార్పిడుల కలకలం

somaraju sharma

బ్రేకింగ్: రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ నేతల ఆర్టికల్ 2 అస్త్రం

Vihari

Raghu Ramakrishnam Raju Case: సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కి రఘురామకృష్ణంరాజు..!!

P Sekhar