Health care: కొంతమంది ఇంట్లో ఉన్న ఆహార పదార్థాల నీటిని తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టస్తూ ఉంటారు.. అయితే కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే ఫ్రిజ్లో నిల్వ ఉంచాలి.. కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయకూడదు.. వాటివలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. అంతేకాకుండా వాటిలో ఉన్న పోషక విలువలు కూడా కోల్పోతాయి.. అయితే ఎటువంటి ఆహార పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటి కాయలు చాలామంది ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.. ఇలా అరటి కాయలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఎందుకంటే అందులో ఉండే ఎంజైమ్లు తగ్గిపోతాయి. ఇంకా త్వరగా అరటికాయలు పాడైపోతాయి కూడా.. మనం బ్రెడ్ తిన్నాక చాలా మంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు.. దీనివలన బ్రెడ్ గట్టిగా తయారవుతుంది. ఇంకా ఫ్రిజ్ లో నుంచి బయటకు తీసి పెడితే త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా బయట నిల్వ చేసుకోవడం మంచిది. పైగా దాని రుచి కూడా కోల్పోదు.. ఎక్కువ మంది పచ్చళ్లను ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. ఇలా ఫ్రిజ్ లో నిల్వ ఉన్న పచ్చళ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా కాకుండా పచ్చళ్లు బయటే జాడీలో లేదా పింగాణీ వాటిలో నిల్వ చేసుకోవచ్చు.
ఎక్కువగా ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదు. తాజా పండ్లను అప్పటికప్పుడే తినాలి. ముఖ్యంగా పుచ్చకాయలను.. అది కూడా సగం కోసిన పుచ్చకాయలు కొంతమంది ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. లేదు అంటే స్లైస్ గా కట్ చేసి అలాగే పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఒక బాక్స్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. బంగాళదుంపలను కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఇందులో ఉండే పిండి పదార్థాలు త్వరగా కోల్పోతాయి. పైగా కూర వండినా కూడా రుచి రాదు.