NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Heart Palpitations: గుండె దడ ఇలా తగ్గించుకోండి..!!

Heart Palpitations: గుండె దడ.. మనలో ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఎప్పుడో ఒకప్పుడు ఎదురై ఉంటుంది.. పరీక్షలకు వెళ్ళేప్పుడో, ఏ విషయం గురించైనా ఆందోళనతో ఎదురు చూసేటప్పుడో, ఏదైనా వినకూడని వినాల్సి వస్తుందో అప్పుడు గుండె దడ రావటం (Heart Palpitations) సహజం.. అయితే ఇది కొన్ని సార్లు సాధారణంగా కాకుండా ఇబ్బందికి గురి చేస్తుంది. అటువంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!? అందుకు గల కారణలు గురించి తెలుసుకుందాం..!!

Heart Palpitations: Symptoms and Precautions
Heart Palpitations Symptoms and Precautions

దడ ఉన్న అన్ని సందర్భాల్లో గుండె (Heart ) కు ఏదో సమస్య వస్తుందని కాదు. మానసిక, శారీరక ఒత్తిడి (Stress)  అనారోగ్యం వలన వస్తుంది. మరికొందరిలో డిహైడ్రేషన్ (Dehydration)  ఉన్నప్పుడు వస్తుంది. అకస్మాత్తుగా లేవడం, నిలబడటం, కిందకు వంగడం, గుండె కు శ్రమను కలిగించే వాటి వలన గుండె దడ వస్తుంది. అటువంటప్పుడు ఒత్తిడికి దూరంగా ఉండాల్సిందే. ఒత్తిడి కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కేవలం గుండె దడగా ఉన్నప్పుడే కాకుండా రోజంతా మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి కలిగించే ఆలోచనలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజు కనీసం అరగంటైనా వ్యాయామం, ధ్యానం చేయాలి.

Heart Palpitations: Symptoms and Precautions
Heart Palpitations Symptoms and Precautions

 

డిహైడ్రేషన్ వలన కూడా గుండె దడ వస్తుంది. అందుకని రోజు తప్పనిసరిగా 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. పుచ్చకాయ, కర్భుజ, కీర దోస, దానిమ్మ పండ్లు తినాలి. ఫ్రూట్ జ్యూస్ లను తాగాలి. కొబ్బరి బొండం నీళ్ళు, నిమ్మ రసం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. గుండె వేగాన్ని పెంచే కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కాఫీ తాగకూడదు. కూల్ డ్రింక్స్, టీ, చెక్కర ఎక్కువగా ఉండే పానీయాలు తాగకూడదు.

Heart Palpitations: Symptoms and Precautions
Heart Palpitations Symptoms and Precautions

రక్త హీనత (Anemia) వలన శరీర కణజాలానికి ప్రాణవాయువు సరఫరా తగ్గి పోతుంది. అందువలన ఆయాసం, గుండె దడ వస్తుంది. థైరాయిడ్ (Thyroid) తో బాధ పడుతున్న వారిలో కూడా గుండె దడ వస్తుంది. కొందరి మహిళలలో బహిష్టు ఆగిపోయే సమయంలో హార్మోన్ ల విడుదల లోపం వలన రక్తప్రసరణ అదుపు తప్పి గుండె దడ వస్తుంది. ఉబ్బసం కోసం ఉపయోగించే ముందులు గుండె దడ ను కలిగిస్తాయి. ఈ సమస్యలను నియంత్రణలో ఉంచుకుంటే గుండె దడ రాకుండా చేసుకోవచ్చు.

Heart Palpitations: Symptoms and Precautions
Heart Palpitations Symptoms and Precautions

గుండె దడగా ఉన్నప్పుడు చల్లని నీటితో ముఖం కడుక్కోవలి. ఊపిరి బిగబట్టి వదలాలి. గుండెలో విద్యుత్ స్పందనల తీరుతెన్నులు అస్తవ్యస్తమైన, కవాట సమస్యలు ఉన్నవారికి దడ వస్తుంది. ప్రత్యేకమైన కారణాలేవి లేకుండా గుండె దడగా అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju