ట్రెండింగ్

Cyclone Asani Update: కొన్ని గంటలలో అసాని తుఫాను ఒంగోలు- బాపట్ల వైపు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు..!!

Share

Cyclone Asani: అసాని తుఫాను కారణంగా సముద్ర తీరాలలో అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర పై ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో.. విశాఖపట్టణం కలెక్టర్ రానున్న 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అసాని తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాలలో… అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

HEAVY DOWNPOUR for next 3 hours ongole along with baptla

ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో.. రానున్న మూడు గంటల్లో అతి వేగంతో గాలులు వీస్తాయని వర్షాలు పడతాయని… ప్రకాశం జిల్లాలో ప్రజలు ముఖ్యంగా ఒంగోలు, బాపట్ల నగరానికి చెందిన వాళ్ళు.. జాగ్రత్తగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు రాత్రికి అసాని తుఫాను చీరాల బాపట్ల వైపు వచ్చే అవకాశం ఉందని.. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలియజేశారు.

 

అసాని తుఫాను కారణంగా చెన్నై శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. చెన్నై, తిరువల్లూరు జిల్లాలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తిరువళ్లూరు జిల్లాకి సంబంధించి రాకపోకలు మొత్తం ఆగిపోయాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు రాత్రికి అసాని తన దిశను మార్చుకుని చీరాల -బాపట్ల వైపు వచ్చే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు. అసాని తుఫాను ప్రభావం రాష్ట్రంలో నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలతో పాటు మూడు జిల్లాలపై ప్రభావం గట్టిగా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలలో అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అందరినీ అలర్ట్ చేయడం జరిగింది.


Share

Related posts

Mahesh Trivikram: అప్ కమింగ్ సినిమా కోసం సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్న మహేష్-త్రివిక్రమ్..??

sekhar

Brahmi: బ్రహ్మి మొక్క తో ఆరోగ్యమే కాదు అందం కూడా మీ సొంతం..!!

bharani jella

బిగ్ బాస్ 4 : టికెట్టు ఫినాలే టాస్క్ లో లెవెల్ 2కి వెళ్లి పోయిన ఆ నలుగురు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar