Helping Hands: చిన్నారి చిట్టి సాయం.. కొండంత ధైర్యం..!!

Share

Helping Hands: ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని వినే ఉంటారు కదా.. కొన్నిసార్లు మనం చేసే సహాయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.. మన సంతోషం తో పాటు పక్కవారి సంతోషంగా ఉండాలని కోరుకునే వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు.. తాజాగా ఒక మహిళ కరోనా పేషెంట్స్ కోసం వంట చేసి వాటిని ప్యాకెట్స్ లో పెట్టి ఆసుపత్రులలో పంచుతున్నారు.. అయితే ఆమె కొడుకు కూడా తన తల్లికి ఆహార ప్యాకెట్స్ సర్దడం లో సాయం చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Helping Hands: small boy writing on stay happy on mother preparing rice packets to covid patients
Helping Hands: small boy writing on stay happy on mother preparing rice packets to covid patients

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. ఒకవైపు ఆసుపత్రిలో ఆక్సిజన్, బెడ్స్, వెంటిలేటర్స్ కొరతతో అల్లాడి పోతుంటే.. మరోవైపు ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ నటులు, సామాన్యులు అందరూ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఒక మహిళ కరోనా రోగుల కోసం వంట చేసి ఆహారాన్ని ప్యాక్ చేసి ఆస్పత్రులలో పంచుతోంది.. అయితే ఆమె కొడుకు కూడా తన తల్లి సిద్ధం చేసిన ఆహార అ ప్యాకెట్స్ పై ఆ చిన్నారి తన చిట్టి చేతులతో “సంతోషంగా ఉండండి” అంటూ ఇంగ్లీష్, హిందీ భాషలలో రాస్తూ, ఓ స్మైల్ చిత్రాన్ని గీస్తున్నాడు.. ఆ చిన్నారి చేస్తున్న పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఈ చిన్నారి చేసిన పని అందరిలోనూ కొత్త ధైర్యాన్ని నింపుతుంది.. ఈ చిన్నారి లాగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుందాం..


Share

Related posts

వ్యూహాలపై విపక్షాల మంతనాలు

somaraju sharma

ఆ స‌ర్టిఫికెట్ లేక‌పోతే వాహనదారులకు భారీ జ‌రిమానా.. ఎందుకంటే?

Teja

డబ్బుల కోసం అలా చేస్తా అనుకోకండి …?

GRK