Bellamkonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ ప్రొడక్షన్స్ అధినేత కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. సినిమా స్క్రిప్ట్ కోసం ఎంత కష్టాన్ని కైనా రెడీ అవుతూ ఉంటాడు. డాన్స్ పరంగా ఫైట్లు పరంగా అదే రీతిలో… ఫిట్ నెస్ పరంగా.. అన్ని రకాలుగా .. సినిమా ఆడియన్స్ నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసే తరహాలో.. సినిమాలు చేస్తూ ఉంటాడు.
అటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన అభిమానుల విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటాడు. ఈ రీతిగానే ఇటీవల ఓ అభిమానికి మర్చిపోలేని లైఫ్ టైం మెమరబుల్ సడన్ సర్ప్రైస్ ఇవ్వటం జరిగింది. విషయంలోకి వెళితే ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వీరాభిమాని కొత్తగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి సదరు అభిమాని కార్డు పంపాడు.
Read More: Corona: గ్యాప్ ఇవ్వండి మహప్రభో.. దేశంలో ఇంకో కరోనా ఫంగస్
అయితే ప్రస్తుతం కరోనా కష్టకాలంలో అయినా గాని అభిమాని కోరిక మేరకు సడన్ ఎంట్రీ ఇచ్చి అభిమాని ఆనందంలో.. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో రావడంతో ఆ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా భారీగా వచ్చారు. అభిమాని కోరిక మేరకు చాలా దూరం.., అది కూడా కష్ట కాలంలో హీరో వెళ్లడంతో ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కరోనా కష్టకాలంలో కూడా అభిమానుల ఆనందం కోసం ఈ రీతిగా హీరో వ్యవహరించటం నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.