Raja Vikramarka: హీరో కార్తికేయ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కార్తికేయ, మెగాస్టార్ చిరంజీవి కి అభిమానినని ఇప్పటికీ పలు షోలలో తెలియజేశారు.. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కి హాజరైన చిరంజీవి ముందు ఆయన నటించిన ఆయన పాటికే స్టెప్పులేసి శభాష్ అనిపించుకున్నాడు కార్తికేయ.. తాజాగా స్టార్ చిరంజీవి నటించిన “రాజా విక్రమార్క” సినిమా టైటిల్ ను తను నటించబోతున్న కొత్త సినిమాకు టైటిల్ గా ఎంచుకున్నారు..!! అభిమానానికి మించిన అర్హత ఏముంది అని తెలియజేశారు..!! తాజాగా అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ వంగా రాజా విక్రమార్క సినిమా టైటిల్, అలాగే ఈ సినిమాలోని విక్రమార్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..!!
Read More: Bhari Taraganam: భారీ తారాగణం నుంచి బాపు బొమ్మ లిరికల్ సాంగ్ విడుదల..
రాజా విక్రమార్క సినిమాను నూతన దర్శకుడు శ్రీ సిరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తోంది. తాన్యా రవిచంద్రన్ ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు. ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతోంది ఈ కన్నడ బ్యూటీ.. ఈ సినిమాలో కార్తికేయ ఒక ఎన్ఐఏ ఆఫీసర్ గా నటించనున్నట్లు ఇంతకుముందే తెలియజేశారు. ఈ సినిమాను శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయికుమార్, సుధాకర్, కొమ్మకుల పశుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం సమకూరుస్తున్నారు.