Jabardasth Show: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు అత్యధికంగా ఆదరించిన షో జబర్దస్త్ కామెడీ షో. ఈ టీవీలో ప్రసారం అయ్యే ఈ షోకి రికార్డుస్థాయిలో టిఆర్పి రేటింగులు ఎప్పటి నుండో నమోదు అవుతూ ఉంటాయి. ఇప్పటివరకు తెలుగు టెలివిజన్ రంగంలో ఈ జబర్దస్త్ షోను అధిగమించిన షో మరొకటి లేదు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ టీవీలో ప్రసారమయ్యే ఈ షో ద్వారా చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిలో ఒకరు అదిరే అభి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తన అదిరిపోయే కామెడీ టైమింగ్ తో పాటు.. పంచ్ డైలాగులతో తనదైన శైలిలో జబర్దస్త్ షో వేదికపై కామెడీ పండించిన అదిరే అభి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అదిరే అభి మాట్లాడుతూ.. కరోనా తర్వాత పరిస్థితులు మారాయని లాక్ డౌన్ సమయంలో జనాలకు ఓటీటీ అలవాటు అయ్యింది అని చెప్పుకొచ్చారు. ఇక కెరియర్ ప్రారంభంలో రాజమౌళి సినిమా లలో పనిచేయటం గురించి కూడా సరికొత్త విషయాలు తెలియజేశారు. ఎప్పుడూ కూడా కొత్తవిషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి అని తెలిపారు. యూట్యూబ్ ద్వారా తమిళం నేర్చుకున్నట్లు స్పష్టం చేశారు.
రాజమౌళి ఎంతగానో సపోర్ట్ చేసే వారిని అదిరే అభి పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ప్రభాస్ హీరోయిన్ అనుష్క చాలా స్వీట్ పర్సన్స్ అని తెలిపారు. రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ కూడా పట్టించుకునే సందర్భాలు లేవని అన్నారు. ఇండస్ట్రీలో రాకముందు సాఫ్ట్ వేర్ లో భారీ అవకాశాలు వచ్చాయని తెలిపారు. డబ్బులు కోసం సినిమాను వదిలి పెట్టిన సందర్భాలు మాత్రం లేవని చెప్పుకొచ్చారు. అవకాశాల కోసం అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో హీరో వెంకటేష్ గారిని రెండు మూడు సార్లు కలిసిన సందర్భంలో జబర్దస్త్ స్కిట్ లలో అందరూ బలే కామెడీ చేస్తారు అని మెచ్చుకున్నట్లు అదిరే అభి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.