Chandrababu Vishal: 2024 ఎన్నికలలో చంద్రబాబుని(Chandrababu) ఓడించడానికి వైసీపీ తమిళ హీరో విశాల్ నీ కుప్పం(Kuppam) బరిలో దింపుతున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కి హీరో విశాల్(Vishal) మద్దతు ఇచ్చే తరహాలో గతంలో కామెంట్లు చేయడంతో.. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇటువంటి తరుణంలో ఏపీ రాజకీయాల్లోకి తాను ఎంట్రీ ఇస్తున్నట్లు కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై హీరో విశాల్ రియాక్ట్ అయ్యారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు.. కుప్పం నుండి పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. మొత్తం ఫేక్ వార్తలే. ఎక్కడనుండి ఈ వార్తలు పుట్టుకొస్తున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. అసలు పోటీకి విషయంకి సంబంధించి ఎవరూ కూడా నన్ను ఇంతవరకు సంప్రదించలేదు. పూర్తిగా అవాస్తవమైన వార్తలు నాపై ప్రచారం చేస్తున్నారు. నా దృష్టి మొత్తం సినిమాల పైనే ఉంది. అంటూ సోషల్ మీడియాలో హీరో విశాల్ తనదైన శైలిలో స్పందించారు.
ఇక ఇదే వార్తపై వైసీపీ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేది మరియు ఆయనను ఓడించేది.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న భరత్ యే అని అన్నారు. ఎటువంటి సినీ యాక్టర్ కుప్పంలో వైసీపీ తరఫున పోటీ చేయడం లేదని పెద్దిరెడ్డి గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా తెలియజేయడంతో… ఏపీలో కుప్పంలో విశాల్ పోటీ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.