KGF: కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరో యాష్ “కేజిఎఫ్” సినిమాతో ఓవర్ నైట్ లోనే దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించాడు. “కేజిఎఫ్” అనేక భాషలలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. మొట్టమొదటిసారిగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా .. అక్కడ బాక్సాఫీస్ దగ్గర అన్ని సినిమాల రికార్డులను పగలగొట్టింది. యాష్ హై వోల్టేజ్ యాక్షన్ కి తోడైనా ప్రశాంత్ నీల్ దర్శకత్వం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ప్రస్తుతం కరోనా తీసుకొచ్చిన కష్టాలు లాక్డౌన్ వాళ్ళన్న అనేక వ్యవస్థలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గత ఏడాది నుండి నష్టపోతూ వస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే చాలామంది దేశవ్యాప్తంగా ఉన్న సినిమా హీరోలు ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూ మరోపక్క సహాయాలు చేస్తూ వస్తున్నారు. కరోనా రోగులకు పేదవాళ్లకు ఇలా అనేక రకాలుగా తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు యాష్ కన్నడ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయేలా.. కన్నడ సినీ కార్మికులకు అనగా ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్ల కు చెందిన మూడు వేల కుటుంబాలకు సహాయం చేయటానికి రెడీ అయ్యారు. ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 5,000 రూపాయలు అందిస్తూ మరిన్ని సహాయ కార్యక్రమాలు యాష్ చేయడం జరుగుతుంది.
Read More: KGF 2 : కేజిఎఫ్ 2 రేటు ఎంతో చూడండి బాహుబలి ని మించి మించి మించిపోయిన రేంజ్ లో డబ్బు రాబోతోంది.
దాదాపు ఇరవై ఒక్క డిపార్ట్ మెంట్లకు సరుకులతో పాటు ఆర్థిక సహాయం చేస్తూ ఇప్పటివరకు యాష్ 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. యాష్ చేసిన సహాయం పట్ల కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాష్ చేసిన సాయం పట్ల చాలామంది ప్రముఖులు అభినందిస్తున్నారు. సొంత డబ్బును ఈ రీతిలో ఖర్చు పెట్టడం నిజంగా గ్రేట్ అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యాష్ క్రేజీ ప్రాజెక్ట్ “కేజిఎఫ్ 2” రిలీజ్ డేట్ జూలై 16 వ తారీకు ప్రకటించాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.