ట్రెండింగ్ న్యూస్

వైయస్ జగన్ ని మెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్..!!

Share

టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా లో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ టైం కీర్తి సురేష్ .. మహేష్ తో నటిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా బ్యాంక్ రోబారి తరహాలో సినిమా స్టోరీ ఉండటంతో…ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

CM YS Jagan participates in Gopujaఇదిలా ఉంటే కీర్తి సురేష్ ఒకానొక సమయంలో మహానటి సినిమా చేసి రాజకీయంగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రశంసల వర్షం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కీర్తి సురేషే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించింది. కనుమ పండుగ నాడు గోపూజ సమయంలో… తన దగ్గరకు వచ్చిన గోమాత దండం పెడుతున్న తరుణంలో ఇనుప భారీ గేట్.. గోవుకు తగిలే సమయంలో జగన్ చేయిపెట్టి అడ్డుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది.

 

అయితే ఈ వీడియో చూసిందేమో తెలియదు గానీ కీర్తి సురేష్.. వైయస్ జగన్ అన్ని మతాలను గౌరవించే ముఖ్యమంత్రి అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆమె మెచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవ్వుతోంది. ప్రతిపక్షాలు మతాల మధ్య గొడవ పెట్టే తరహాలో సీఎం జగన్ పాలన ఉందని.. ఆరోపణలు చేస్తున్న సమయంలో హీరోయిన్ కీర్తి సురేష్.. జగన్ అన్ని మతాలను గౌరవించడం వ్యక్తి అని అన్నట్లు వార్తలు రావటం సంచలనంగా మారింది.


Share

Related posts

అంతా బానే ఉంది జగన్ … కానీ ‘ ఆ పాయింట్ ‘ లో అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉన్నావ్ ! 

sekhar

‘ప్రెజర్ కుక్కర్’లో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Teja

Today Gold Rate: మహిళలకు శుభవార్త.. ఈరోజు స్థిరంగా బంగారం, వెండి ధరలు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar