Purna: తెలుగు టెలివిజన్ రంగంలో “ఢీ” షోకి మంచి పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా చాలా మంది డ్యాన్సర్లు వెలుగులోకి వచ్చారు. కొంతమంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో విజయవంతంగా కూడా రాణిస్తున్నారు. ఈ షోలో ఎక్కువగా వినిపించే పేరు హీరోయిన్ పూర్ణ. కేరళ కుట్టి అచ్చం తెలుగు అమ్మాయిల మాట్లాడే పూర్ణ.. అతి తక్కువ టైమ్ లోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. డ్రెస్సింగ్ విషయంలో ఇంకా చాలా విషయాలలో ఒద్దికగా ఉంటూ… చక్కటి తెలుగుదనాన్ని ప్రతిబింబించే రీతిలో పూర్ణ చాలామంది కుటుంబ ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఢీ షో కి చాలా కాలం నుండి జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె… ఇటీవల ఆషో నుండి తప్పుకోవడం జరిగింది. దీంతో పూర్ణా షో నుండి బయటకు వచ్చేయడం పట్ల రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. అయితే షో నుండి బయటకు రావడానికి గల కారణం గురించి పూర్ణ ఇటీవల వివరణ ఇచ్చింది. ఢీ లో ఎక్కువగా కౌగిలింతలు ఇవ్వలేక షో నుండి బయటకు వచ్చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది.
షోలో డాన్స్ ఎవరైనా డాన్స్ ఇరగదీసిన డ్యాన్సర్లకు హగ్ ఇవ్వాలని… చెప్పుకొచ్చింది. వాళ్లకి మాత్రమే కాదు డాన్స్ మాస్టర్ లకు మరియు యాంకర్లకు కూడా హగ్ ఇవ్వాలని ఆ పని చేయటం ఇష్టం లేకే ఢీ షో నుండి బయటకు రావడం జరిగింది అని పేర్కొంది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక పక్క టెలివిజన్ రంగంలో మరియు సినిమా ఇండస్ట్రీలో రాణించిన పూర్ణ త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. యూఏఈ లో ఉండే ఓ ప్రముఖ వ్యాపార వేత్తనీ పూర్ణ పెళ్ళాడబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇటీవలే ఆమె తెలియజేయడం జరిగింది.