Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో త్వరలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్ లు ముగిశాయి. ఐదవ సీజన్ గత ఏడాది డిసెంబర్ 19 వ తారీకు నాడు కంప్లీట్ కావడం జరిగింది. సన్నీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఒక సీజన్ ముగిశాక మరొక సీజన్ ప్రారంభం కావాలంటే షో నిర్వాహకులు దాదాపు తొమ్మిది నెలలు టైం తీసుకుంటారు. కానీ సీజన్ ఫైవ్ ముగిసిన వెంటనే ఆరో సీజన్ స్టార్ట్ చేయడానికి ఏ మాత్రం టైం తీసుకోకుండానే రెండు నెలల గ్యాప్ లోనే.. ఓటిటీలో 24 గంటలు హౌస్ లో జరిగేది చూపించడానికి రెడీ అవుతున్నారు.
ముఖ్యంగా గత సీజన్ కి ఐపీఎల్… ఇంకా పలువురు షోలు పోటీగా రావడంతో పాటు హౌస్ లో తెలియని ముఖాలు ఉండటంతో టిఆర్పి రేటింగులు పెద్దగా సాధించలేదని టాక్. దీంతో ఐదవ సీజన్ లో జరిగిన డ్యామేజ్.. పుర్చడానికి షో నిర్వాహకులు ఓటీటీ బిగ్ బాస్ అతి త్వరగా స్టార్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇటువంటి తరుణంలో హౌస్ లో ప్రతీ కంటెస్టెంట్ బయట చూసే ప్రేక్షకులకు తెలిసే రీతిలో ఉండాలని.. కంటెస్టెంట్స్ సెలక్షన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారట.
ఈ నేపథ్యంలో ఈ ఓటిటి బిగ్ బాస్ లోకి… సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి చెల్లెలని తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారట. ఈ క్రమంలో ఇటీవల నేరుగా ఆమెకు మా టీవీ యాజమాన్యం ఫోన్ చేసి రెమ్యూనరేషన్ విషయంలో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సాయి పల్లవికి… దక్షిణాది సినిమా రంగంలో సపరేట్ గుర్తింపు ఉండటంతో… ఆమె చెల్లెలు హౌస్ లోకి తీసుకు వస్తే ఒక తెలుగు వారు మాత్రమే కాక దక్షిణాదిలో తమిళం మరియు మలయాళం ఇంకా పలు భాషలకు చెందిన వాళ్ళు చూసే అవకాశం ఉందని ఓట్లు మరియు కాల్ లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయని సాయి పల్లవి క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మాటివి యాజమాన్యం ఆమె చెల్లెలకు ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.