బిగ్బాస్ సీజన్ 6 త్వరలో ప్రారంభం కానుంది. టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఈషో కి సంబంధించి అత్యంత కఠినమైన నిర్ణయాలు షో నిర్వాహకులు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారు ఎక్కువగా ధీయేటర్ ఇంకా బయటికి వెళ్లకుండా ఓటిటి లకి అలవాటు పడుతూ ఉండటంతో సీజన్ 6 గ్రాండ్ సక్సెస్ కావాలని షో నిర్వాహకులు కఠినమైన నిబంధనలు హౌస్ లో ఎంట్రీ ఇచ్చే సభ్యులకు విధించినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఇప్పటివరకు తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ అని సీజన్ లకి సంబంధించి వీకెండ్ ఎపిసోడ్ లలో ఏం జరిగేదో ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయిపోయినాయి.
ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నారు.. ఇంక సోమవారం వచ్చేసరికి ఎవరు ఎలిమినేషన్ లోకి వెళ్లారు అనే ఉత్కంఠ ఎపిసోడ్లకు సంబంధించి ముందుగానే లీకు వార్తలు బయటకు రావటంతో షోపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే ఇప్పుడు టెక్నికల్ టీం విషయంలో షో నిర్వాహకులు.. కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు షో అయ్యేవరకు.. ఎవరు కూడా ఇంటికి వెళ్లకుండా.. స్టూడియోలోనే వాళ్లకి అన్ని ఏర్పాట్లు పెట్టినట్లు టాక్. టెక్నికల్ టీం ఎవరు కూడా సోషల్ మీడియా వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇందుకు గాను వారికి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ షో నిర్వాహకులు ఇవ్వటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
అంతేకాదు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా… షో మొత్తం ముగిసే వరకు బయట ఏ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ముందుగానే మాట్లాడుకుంటున్నట్లు సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సీజన్ 6 లో లీక్ బెడద లేకుండా చూసుకోవాలని షో నిర్వాహకులు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఈసారి అతిపెద్ద స్టార్ కంటెస్టెంట్స్ నీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురానున్నట్లు సమాచారం.