Home Loan EMI: హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈఎంఐ భారాన్ని ఎలా తగ్గించుకోవచ్చంటే..!?

home loan emi
Share

Home Loan EMI: ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వారి స్థోమతను బట్టి బ్యాంకుల నుండి హౌసింగ్ లోన్ తీసుకుంటుంటారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఇంటి తనఖా, భూమి తనఖాపై హౌసింగ్ లోన్లు ఇస్తున్నాయి. అదే విదంగా ఆపార్ట్ మెంట్స్ కొనుగోళ్లకు రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు, ఇతర సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. ప్రదానంగా హౌసింగ్ లోన్ లో వినియోగదారులు రెండు అంశాలపై దృష్టి సారించాలి. ఒకటి వడ్డీ రేటు, రెండు చెల్లింపుల ఎంచుకునే కాలపరిమితి. కొత్తగా హౌసింగ్ లోన్ లు తీసుకునే వారు  ఈ అంశాలపై దృష్టి పెట్టుకుంటే ఈఎంఐ లను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

home loan emi
home loan emi

సాధారణంగా బ్యాంకులు, సంస్థలు ఇంటి విలువలో 80 నుండి 85 శాతం వరకూ రుణం ఇస్తుంటాయి. మరి కొన్ని సంస్థలు వడ్డీరేటు ఎక్కువతో 90 శాతం వరకూ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లించి మిగిలిన మొత్తాన్ని రుణంగా తీసుకుంటే తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందవచ్చు. తద్వారా రిస్క్ లేకుండా ఈవీఎంలు చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారు ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే ఈవిఎం భారాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఎక్కువ కాలపరిమితితో ఈఎంఐలు చెల్లించినట్లైయితే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. తక్కువ ఈఎంఐలు పెట్టుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది. తక్కువ సమయంలో రుణం తీరిపోతుంది.

ప్రధానంగా హౌసింగ్ లోన్ కోసం ఏదైనా బ్యాంకును, రుణ సంస్థలను ఎంచుకునే ముందు ఆన్ లైన్ లో వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లను పరిశీలించుకోవడం మంచింది. సరైన రుణం పొందేందుకు ప్రస్తుతం అనేక వెబ్ సైట్ లు సహాయపడుతున్నాయి. ఆన్ లైన్ పోర్టల్స్, వివిధ సంస్థలు అందించే రుణాలు, వాటి వడ్డీ రేట్లు, ఫీజులు అలాగే ఇతర చార్జీల గురించి వివరంగా తెలియజేస్తున్నాయి. అన్ని విషయాలను పరిశీలించి హౌసింగ్ లోన్ తీసుకోవడం శ్రేయస్కరం.


Share

Related posts

మళ్లీ ఫెయిల్ అవబోతున్న జగన్ ‘విజయదశమి” ముహూర్తం! కారణం పెద్దదే!!

Yandamuri

ముంబైలో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్..??

sekhar

ఇద్దరే ఇద్దరు… వారిలో ఒకరు ‘ఆయన’?

Yandamuri