Beard: గడ్డం పెంచుకోవడం ఇప్పటి తరం ఫ్యాషన్.. టాప్ సెలబ్రెటీల నుంచి కాలేజీ కుర్రాళ్లు వరకు అందరూ ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. కొంత మందినీ గడ్డం తో చూస్తే మ్యాన్లీ గా కనిపిస్తారు.. అందమైన గడ్డం తో పాటు కోరమీసం కూడా ఇప్పటి ట్రెండ్ లో భాగమే.. కొంతమందికి గడ్డం, మీసాలు ఒత్తుగా పెరుగుతాయి.. మరి కొంత మందికి పలచగా ఉంటాయి.. అలా అని దిగులు చెందాల్సిన అవసరం లేదు.. మన ఇంట్లో లభించే ఈ వస్తువులతో ఒత్తైన గడ్డం, మీసం సొంతం చేసుకోవచ్చు అందుకోసం ఈ సింపుల్ చిట్కా ప్రయత్నిస్తే చాలు..
Beard: గడ్డం మీసాలు పెరగడానికి వంటింటి అద్భుతమైన చిట్కా.. నూరు శాతం ఫలితాలు..
ముందుగా ఒక టమాటో ని తీసుకొని చెక్కు తీసుకొని మిక్సీ పట్టి గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటో గుజ్జులో, అర స్పూన్ కలబంద గుజ్జు, ఒక టీ స్పూన్ ఆముదం, అర టీ స్పూన్ నల్ల జీలకర్ర పొడిని కలపాలి. వీటన్నింటినీ కలిపి మిశ్రమం లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రి నిద్రపోయే ముందు గడ్డం, మీసాలకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా రాత్రంతా ఉంచుకొని మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటి తో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే కచ్చితంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరి కొంత మందికి జుట్టు నిదానంగా పెరగవచ్చు. అయితే ఈ చిట్కా ప్రయత్నిస్తే మాత్రం కచ్చితంగా ఫలితం ఉంటుంది. దీని వల్ల గడ్డం, మీసాలు బాగా పెరుగుతాయి.
టమాటో లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఆముదం, కలబంద, నల్ల జీలకర్ర లో విటమిన్ – ఇ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. గడ్డం మీసాలు ఒత్తుగా ఉంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. వారి చూపు మీపై ఉంటుంది. మీ గడ్డం, మీసాలు పలుచగా ఉంటే ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి. నూరు శాతం ఫలితాలను ఇస్తుంది.
గడ్డం పెంచిన అంత మాత్రాన సరిపోదు.. దాన్ని సరిగ్గా మెయింటైన్ కూడా చేయాలి. అప్పుడే అది మ్యాన్లీ లోక్ ఇస్తుంది. లేదంటే ఏదో గుబురు పెరిగినట్టు ఉంటుంది. రోజు గడ్డం దువ్వితే అది నీట్ గా ఉంటుంది.. దీని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు.. తల దివ్వేటప్పుడు గడ్డం ని కూడా ఒకసారి దువ్వండి. ఇలా రోజు గంట ముద్దు పెట్టడం వలన ఆ ప్రదేశం లో వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో గడ్డం త్వరగా పెరగడానికి సహాయపడుతుంది.