సాధారణంగా మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ముందు వరుసలో ఉంటుంది అని చెప్పొచ్చు. దీనికి కారణం ఒకటని చెప్పలేము. రకరకాల కారణాలు ఉంటాయి. దీని వల్ల ఎంతో బాధ కలిగినా కానీ బయటకు చెప్పుకుంటే బాగుండదని.. నేటికీ చాలా మంది మహిళలు నొప్పిని బరిస్తూనే ఉన్నారు.కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇలా బాధ ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలా చేస్తేనే మీ హెల్త్ కి మంచిది. లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. వాటిని కూడా పాటించడం మంచిది. ఆ మార్గాలు
మొదటిది ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కు మొదటి కారణం డీహైడ్రేషన్ కావడమే. అందుకే ఇలా కాకుండా హైడ్రేటెడ్ గా ఉండాలి. అలా చేస్తే ఈ సమస్య వచ్చే అవకాశం చాలా తక్కువ. రెండు పరిశుభ్రంగా ఉండాలి.
జననేంద్రియ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవద్దు. జననేంద్రియాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
అలగే మన వంటగదిలో ఉండే వెల్లుల్లిని మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. ఇది మంచి యాంటీబయాటిక్ గా పని చేస్తుంది. హీటింగ్ ప్యాడ్స్ వాడాలి. వీటిని వాడటం వల్ల
యుటిఐ కారణంగా కలిగే నొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ప్రోబయోటిక్స్ తీసుకోవాలి.