Food: ఆహారాన్ని నమిలి తింటున్నారా..!? ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి..!!

Share

Food: నేటి ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు మారిపోయాయి.. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం లేదు.. ఒకవేళ భోజనం చేసిన హడావుడిగా నాలుగు ముద్దలు నోట్లో పెట్టుకొని అయిపోయింది అంటున్నారు.. మనం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారం ముఖ్యమో మనం ఎలా తింటున్నాము అనేది కూడా అంతే ముఖ్యం.. మనం ఆహారాన్ని ఏ విధంగా తినలి.. ఎన్నిసార్లు నమిలి తినాలి..!? ఎలా నమిలి తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..!!

How many times You Chew your Food:
How many times You Chew your Food:

Food: అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలి..

సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని, టీవి చూస్తూ, పుస్తకాలు చదువుతూ భోజనం చేయకూడదు అని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు.. అయితే మనం వాటిని పెడ చెవిన పెట్టి అలాగే మన పని మనం చేసుకుంటూ తింటాము.. ఇలా చేయడంవల్ల మనం ఎంత ఆహారం తింటుంది.. ఏం తింటున్నామో.. కూడా మనకి తెలియదు ఒకవేళ ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే బరువు పెరుగుతాం.. అదే తక్కువ ఆహారం తీసుకుంటే నీరసించి పోతారు. భోజనం చేసేటప్పుడు మాట్లాడితే గ్యాస్ సమస్యలు వస్తాయి. అందుకని భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెబుతుంటారు.

How many times You Chew your Food:
How many times You Chew your Food:

Food: ఆహారం నమిలి తినకపోతే ఏమవుతుంది..

అయితే మన శరీరంలో జీర్ణక్రియ అనేది నోట్లోనే మొదలవుతుంది. అక్కడినుంచి జీర్ణాశయం లోకి చేరి జీర్ణమవుతుంది. ఆ తరువాత చిన్న పేగులకు ఆహారం చేరుతుంది. ఈ విధంగా జీర్ణక్రియ జరుగుతుంది. అందువలన మనం ఆహారం నోట్లో ఉన్నప్పుడే బాగా నమిలి తినాలి. దీంతో జీర్ణాశయం పై తక్కువ భారం పడుతుంది. ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. అందుకని మనం భోజనం చేసేటప్పుడే ఆహారం ఎక్కువ సార్లు నమిలి తినాలి.

How many times You Chew your Food:
How many times You Chew your Food:

Food: ఆహారం నమిలి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!!

ఆరోగ్య నిపుణులు కూడా ఆహారాన్ని ఎక్కువ సార్లు నమిలి తినమని సూచిస్తారు.. ఈ విధంగా ఎక్కువ సార్లు నమలడం వలన మనం ఆహారం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. మనం కొంచెం కొంచెంగా నమిలి ఎక్కువ సేపు తింటుంటే ఆహారం జీర్ణం కావడం తో పాటు కడుపు నిండుగా అనిపిస్తుంది.  మన చక్కగా ఆహారాన్ని నమిలి తింటే జీర్ణక్రియ మీద ఒత్తిడి పడదు. జీర్ణ సంబంధిత సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగు పడుతుంది. అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు త్వరగా రావు. ఇలా తినటం బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.

How many times You Chew your Food:
How many times You Chew your Food:

Share

Related posts

బిగ్ బాస్ 4: అఖిల్ బ్రదర్ అభిజిత్ విషయంలో హోస్ట్ నాగార్జున కే షాక్ ఇచ్చాడు..!!

sekhar

Salman Khan: సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’ సెట్ కూల్చేశారు..! కారణం ఏంటంటే..

Muraliak

చైనాకు షాక్.. అండమాన్ జలాల్లో భారత్-అమెరికా నేవీ విన్యాసాలు

Muraliak