జబర్దస్త్ కామెడీ షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో హైపర్ ఆది టీం చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆయన వేసే పంచులకు నవ్వలేక జడ్జీలు, రివర్స్ పంచ్ లు వెయ్యల కంటెస్టెంట్ లు నానా తంటాలు పడుతుంటారు. స్కిట్ మొత్తం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే అతను అను అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్న టాక్ కూడా ఉంది.
ఇక ఆది కి కొన్ని రియల్ లైఫ్ సంఘటనలు తీసుకొని జబర్దస్త్ లోని ఇతర కంటెస్టెంట్ లపై, తన టీం లోని సభ్యుల పై పంచులు వేయడం బాగా అలవాటు. ఎప్పుడూ తన స్కిట్ లో దొరబాబు తో ఆడుకునే అది ఈసారి ప్రసారమైన స్కిట్ లో ముక్కు అవినాష్ పై పడ్డాడు. అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళిన విషయం తెలుసు కదా. అసలు అవినాష్ జబర్దస్త్ ఎందుకు వదిలి వెళ్ళవలసి వచ్చింది అన్నది ఆది చెప్పేశాడు.
ఒకసారి ఏదైనా షో చేస్తూ బయటకు వెళ్తే ఆ షో లోకి తిరిగి రావడం కష్టం. ఇలా చాలా మందిని చూశాం. మంచి భవిష్యత్తు ఉన్న జబర్దస్త్ ను ముక్కు అవినాష్ వదిలేసి వెళ్లాడు అంటే మళ్ళీ అతని జబర్దస్త్ లోకి తీసుకోరు అనే వార్తలు వినపడుతున్నాయి. అలాగే జబర్దస్త్ వారికి నష్టపరిహారం కూడా చెల్లించి అవినాష్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లినట్లు చెబుతున్నారు. ఇక ఆది చెప్పిన మాటలు విని కంటెంట్స్ తో పాటు జడ్జిలు కూడా షాక్ అయ్యారు.
ప్రస్తుతం అవినాష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడట. ఈఎంఐ లు కట్టలేక జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాడు అంటున్నాడు హైపర్ ఆది. ఇన్ డైరెక్ట్ గా అవినాష్ గురించి స్కిట్ లో చెప్పేశాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆది అన్న మాటలు అక్షరాలా నిజం అన్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ ముందే అవినాష్ ఇల్లు కొనుక్కున్నాడు. ఆ తర్వాత కరోనా రావడం…. షూటింగ్ ఆగిపోవడం తో అతను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అన్న వార్తలు వచ్చేశాయి. ఇక ఇప్పుడు ఆది మాటలు వాటికి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఇది కేవలం స్కిట్ లో భాగంగా వేసిన పంచ్ మాత్రమేనా…. లేకపోతే నిజంగానే అది నిజం చెప్పాడా అన్నది అవినాష్ నోరు విప్పితే గాని తెలియదు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!