ట్రెండింగ్

RGV Mahesh: నాకు అర్థం కాలేదు అంటూ.. మహేష్ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్..!!

Share

RGV Mahesh: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోల సినిమాలను తలదన్నేలా సౌత్ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. బాహుబలి 2 మొదలుకొని సౌత్ హవా బాలీవుడ్ లో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవలే RRR, KGF 2 సినిమాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేయటం బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే అనేక రికార్డులు సృష్టించడం సంచలనంగా మారింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సౌత్ ఇండస్ట్రీనీ.. అదేవిధంగా సౌత్ నటీనటులను చిన్నచూపు చూస్తూ గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తూ కథనాలు ప్రసారం చేసే పనిలో ఉన్నట్లు వార్తలు ఇటీవల వైరల్ కావడం తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో సుదీప్ హిందీ భాష పై చేసిన కామెంట్స్.. తీవ్ర రూపం దాల్చాయి.

I do not understand .. RGV reaction to Mahesh's comments

పరిస్థితి ఇలా ఉంటే అడవి శేష్ హీరోగా నటించిన “మేజర్” సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలలో.. పాల్గొన్న మహేష్.. పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బాలీవుడ్.. తనని భరించలేదు అని మీడియా ప్రతినిధులు వేసిన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. దీంతో మహేష్ చేసిన వ్యాఖ్యలు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు.. సౌత్ పై ఏడుస్తున్న బాలీవుడ్ మీడియాకి చిర్రెత్తుకొచ్చినట్లు అయింది. మహేష్ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ కామెంట్లపై మహేష్ క్లారిటీ ఇచ్చిన గాని బాలీవుడ్ మీడియా మాత్రం రకరకాల కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. అయితే ఇదే విషయంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. వర్మ కామెంట్ చేస్తూ..”బాలీవుడ్ అనేది ఒక సంస్థ కాదు. ఎక్కడ సినిమాలు చేయాలి..? ఎలాంటి స్టోరీలో నటించాలన్నది.. అది నటుడి వ్యక్తిగత నిర్ణయం. దానిని తప్పు పట్టడానికి లేదు. కానీ మహేష్ .. తనని బాలీవుడ్ భరించలేదు అని చేసిన కామెంట్స్ కి అర్థం ఏమిటో నాకు కూడా అర్థం కావటం లేదు.

బాలీవుడ్ అనేది కేవలం కంపెనీ కాదు. అది మీడియా వారు సృష్టించిన పేరు. నటీనటులను.. నిర్మాత అదేవిధంగా నిర్మాణ సంస్థలు తమ సినిమాల్లో నటించాలని కోరి డబ్బులు ఇస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు బాలీవుడ్ మొత్తాన్ని జనరలైజ్ చేసి ఎలా చెబుతాం..? అది నాకు అర్థం కావడం లేదు అని తనదైన శైలిలో మహేష్ వ్యాఖ్యలకు ఆర్జీవి స్పందించారు. మరోపక్క బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం మహేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఉన్నారు. కానీ మహేష్ మాత్రం కావాలని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు.. అని వివరణ ఇచ్చారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.


Share

Related posts

Vishnav Tej – Krish : క్రిష్- వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్..

bharani jella

Green Peas: పచ్చి బఠాణీని రోజు తింటే ఏమవుతుందో తెలుసా..!?

bharani jella

బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ ని గెలిపించడంకోసం రంగంలోకి దిగిన హీరో సందీప్ కిషన్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar