IAS Divya Devarajan: కలెక్టర్ పేరునే ఊరికి పెట్టుకున్న గ్రామస్థులు.. అంతగా ఆమె ఏం చేశారు..!?

Share

IAS Divya Devarajan: ఓ మారుమూల గూడెం ప్రజలు కలెక్టర్ ఆఫీసర్ కి వెళ్లి తమ గోడు చెప్పుకుందామన్నా.. ఆ తెగల భాష వారికి వచ్చి ఉండదు.. వచ్చినవారు ఏదో చెప్పడం.. అది తెలుసుకొని పరిస్థితులకు అనుగుణంగా వారి సమస్యలను తీర్చేవారు కలెక్టర్లు.. ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా అక్కడి ప్రజలు చెప్పే భాష మనకు అర్థమైతే వారి సమస్యలను అర్థం చేసుకోవచ్చు అనుకుంది ఐఏఎస్ దివ్య దేవరాజన్.. ఆదిలాబాద్ వాసుల కష్టాలను తెలుసుకుంనేందుకు.. ఈ కలెక్టరమ్మ మూడు నెలల ఈ సమయంలోనే పట్టువదలకుండా ప్రయత్నించి గుండి భాష నేర్చుకుంది అక్కడివారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించింది..!! ఇందుకు ఆదిలాబాద్ వాసులు దివ్య చేసిన పనులకి కృతజ్ఞతతో తమ జిల్లాలోని ఒక ఊరికి దివ్య గూడా అని పేరు పెట్టారు..!!

IAS Divya Devarajan: named on adilabad village
IAS Divya Devarajan: named on adilabad village

దివ్య దేవరాజన్ మా ఊరి ప్రజలకు చేరువై వారి కష్టాలను తెలుసుకోవడం ఎన్నో ప్రయత్నాలు చేశారు.. ఆమె కష్టం ఫలించింది. దాంతో దివ్య ఆఫీసర్ మేడం అనే హోదా నుండి వారి కుటుంబంలో ఒక మనిషి లా కలిసిపోయారు.. ప్రత్యేక గిరిజన కోఆర్డినేటర్ లను , ప్రభుత్వ ఆసుపత్రిలో భాష అనువాదకుల నియమించడం నుండి పరిపాలన కార్యాలయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, స్వయంగా గొండి భాష నేర్చుకోవడం వరకు దివ్య వారి కష్టాలన్ని తీర్చారు.. ఆ ప్రాంతంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం, పారిశుద్ధ్యం, నీటిపారుదల, అనారోగ్యం సమస్యలు, వరదలు వంటి ఇలాంటి ఎన్నో సమస్యలకు ఆమె పరిష్కారం అందించారు.. కాఫీ ల నుండి ఇంటర్ నెట్ కనెక్టివిటీని మూసివేయడం వరకు ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఆదిలాబాద్లోని ఈ ప్రాంతం చూసింది అలాంటి పరిస్థితుల్లో దివ్య ఆ ఊరి ప్రజలు అందరితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించి వారి నమ్మకాన్ని పొందింది.. తోతి వర్గానికి చెందిన గిరిజన నాయకుడు మారుతి ఇన్ని సంవత్సరాలుగా నేను కలెక్టర్ ఆఫీసులో అడుగు పెట్టింది మాత్రం దివ్య మేడం వచ్చిన తర్వాతే.. దివ్య మేడం మాకు కలెక్టర్ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇంటింటికి వెళ్లి అందరినీ పరిచయం చేసుకుంది ఆమెకి మా గ్రామ ప్రజల అందరం పేర్లతో సహా తెలుసునన్నారు మేము నివసించే ఎక్కువగా వచ్చే ప్రదేశం ఆ ప్రాంతానికి బాగు చేయడానికి దివ్య మేడం చర్యలు తీసుకున్నారు. దివ్య మేడం మాకు చేసిన ఈ సహాయాన్ని మాత్రమే కాకుండా డా.సి తరాలు కూడా గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాం పెద్ద బహుమతి ఇద్దామంటే అంత గొప్ప పనికి ఏ బహుమతి ఇవ్వాలో అర్థం కాలేదు అందుకే మా ఊరికి ఆమె పేరు పెట్టామని ఆయన వివరించారుు.

IAS Divya Devarajan: named on adilabad village
IAS Divya Devarajan: named on adilabad village

దీనిపై స్పందించిన కలెక్టర్ దివ్య దేవరాజ్ మాట్లాడుతూ.. వారిని ఏదో పలకరించడమే కాకుండా అన్ని సమస్యలను అడిగి వివరంగా తెలుసుకుని తీర్చ అయితే ఇది అంత సులువుగా జరగలేదు. వారి హక్కులను తీసుకోడానికి వచ్చామేమోనని వాళ్ళు అనుకున్నారు వారి సమస్యలు మాతో పంచుకునే అంత స్వేచ్ఛ ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. తర్వాత వాళ్లు కూడా మమ్మల్ని నమ్ము వాళ్ళింట్లో మనుషుల్లోనే అనుకున్నారు అని చెప్పారు. కమ్యూనికేషన్ అనేది ముఖ్యంగా ఉండాల్సిన చోట హాస్పిటల్. ప్రభుత్వ హాస్పటల్ లో గొండి భాష ట్రాన్స్లేట్ లను నియమించాం. ఇంకా ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయవలసి వస్తే వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్లడానికి అంబులెన్సులు కూడా ఏర్పాటు చేశారు. గ్రామ అభివృద్ధి పనుల్లో పాలుపంచుకోవడానికి రాయి సెంటర్ కార్యకర్తలను దివ్య నియమించారు. ప్రస్తుతం ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్ సీనియర్ సిటిజన్లకు సెక్రటరీ అండ్ కమిషనర్గా నియమితులైన దివ్య. నేను అక్కడ ఉండి ఉంటే కచ్చితంగా వాళ్ళని ఆ పని చేయని ఇచ్చేదాన్ని కాదు అని ఆమె తెలిపారు..


Share

Related posts

సీబీఐని నమ్మడం లేదా..? వివేకా హత్య కేసులో ఏం జరుగుతుంది..!?

Srinivas Manem

Google గూగుల్ లో శృంగారం గురించి చాలామంది వెదుకుతున్న ప్రశ్నలు ఏమిటో తెలుసా?

Kumar

Edible Oil: గుడ్ న్యూస్ః వంట నూనె ధ‌ర‌లు త‌గ్గుముఖం

sridhar