IDBI Bank SSP Plus: భారత ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు తన కస్టమర్లకు శుభవార్త తెలిపింది.. ఐడిబిఐ బ్యాంకు సిస్టమాటిక్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ IDBI Bank SSP Plus పేరుతో కొత్త స్కీమ్ ప్రారంభించింది.. ఈ స్కీమ్ లో కేవలం రూ.100 తో ఖాతా ప్రారంభిస్తే 5 లక్షల వరకు బెనిఫిట్ అందిస్తోంది.. ఈ ఆఫర్ కి సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం..
* ఐడిబిఐ బ్యాంకు సిస్టమాటిక్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ స్కీం లో మనకు నచ్చిన మొత్తాన్ని ప్రతినెల మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కేవలం రూ.100 తో కూడా మనం డిపాజిట్ ప్రారంభించవచ్చు.
* మనం నిర్ణయించుకున్న యమౌంట్ ప్రతినెల మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది.
*ఆ మొత్తం ఓ ప్రత్యేక ఎమౌంట్ లో జమ అవుతూ ఉంటుంది.
*ఈ స్కీం ద్వారా మనకు వడ్డీ కూడా లభిస్తుంది. అయితే ఈ వడ్డీ తోపాటు అదనంగా రూ 5 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనకు బ్యాంకు అందిస్తుంది.
* దీంతోపాటు 1000 రిడీమబుల్ పాయింట్లు కూడా అందిస్తోంది.
*ఈ విషయాన్ని ఐడిబిఐ బ్యాంక్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
*ఈ స్కీం ద్వారా సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు డబ్బులు మనం ఇన్వెస్ట్ చేయవచ్చు.
*ఈ సిస్టమేటిక్ సేవింగ్ ప్లాన్ కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, సమీప బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ప్రారంభించవచ్చు.