సాధారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అవయవ లోపం కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే డయాబెటిస్ తో బాధపడేవారికి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వినికిడిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఏ స్టేజ్ లో వారు ఎలాంటి సమస్యతో బాధపడుతుంటారు. అన్న విషయాలను క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా చెవుడు నాలుగు స్టేజ్ లలో ఉంటుంది. అవి మైల్ డిఫెన్స్, మోడరేట్ డిఫెన్స్, సివియర్ డిఫెన్స్, ప్రొఫౌండ్ డిఫెన్స్ అనే నాలుగు రకాల వినికిడి లోపాలతో బాధపడుతుంటారు. ఇక మైల్ డిఫెన్స్ తో బాధపడే వారు కొద్దిగా గట్టిగా మాట్లాడితే తప్ప వీరికి వినిపించదు. మోడరేట్ డిఫెన్స్ సమస్యతో బాధపడే వారికి కొద్దిగా గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు అంతేకాకుండా మీరు ఖచ్చితంగా హియరింగ్ ఎయిడ్ ధరించకపోతే వీరికి వినపడదు.
సివియర్ డిఫెన్స్ తో బాధపడేవారికి హియరింగ్ ఉన్నా వినపడటం చాలా కష్టం ఇలాంటివారికి సైగలు ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ప్రొ ఫౌండ్ డిఫెన్స్ ఈ సమస్యతో బాధపడే వారిలో ఏమాత్రం వినపడదు. ఇలాంటి వారికి కేవలం రాసే పద్ధతి ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయబడతారు.
పెద్దవారిలో అయితే మనం మాట్లాడేటప్పుడు ఇంకొకసారి చెప్పమని అడగడం, టీవీలో సౌండ్ ఎక్కువగా పెట్టుకొని చూడడం, వినికిడి సమస్యతో బాధపడేవారు చాలా గట్టిగా అరవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వినికిడి సమస్య వారిలో తలెత్తడానికి గల కారణాలు, సికిల్సెల్ అనీమియా, డయాబెటిస్, తలకు ఏదైనా పెద్ద గాయం తగిలినప్పుడు, ఒక్కసారిగా పెద్ద శబ్దం విన్నప్పుడు ఇలాంటి కొన్ని కారణాల వల్ల మధ్యలో వినికిడి లోపాలు రావడం తలెత్తుతాయి.