Torn Notes: ఒకప్పుడు ఎకౌంటు నుంచి డబ్బులు డ్రా చేయాలంటే బ్యాంకు కి వెళ్లి వెళ్లేవారు.. కానీ ఏటీఎం వచ్చాక ఎప్పుడైనా ఎక్కడైనా డ్రా చేసుకుంటున్నారు.. అసలే ఇప్పుడు కరోనా టైం కావడంతో బ్యాంకులకు వెళ్లే డబ్బులు డ్రా చేసే వారి సంఖ్య మరింత తగ్గింది.. ఇప్పుడు మనీ డ్రా చేయాలంటే ఏటీఎం కు వెళ్ళాం.. అయితే ఏటీఎం నుంచి చిరిగిపోయిన, చెల్లని నోట్లు వచ్చాయా..!? అయితే అయితే ఎలా మార్చుకోవాలని చింతించకండి..!! ఈ కింది విధంగా చేసి మంచి నోట్లు పొందండి..!!

Read More: Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
* ముందుగా మీరు డబ్బులను మార్చుకోవడానికి ఏ బ్యాంక్ ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేశారో ఆ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి ఒక లెటర్ రూపంలో దరఖాస్తు చేసుకోవాలి.
*మనం ఎంత డబ్బు డ్రా చేసుకున్న విషయాన్ని దరఖాస్తులో తెలుపుతూ విత్ డ్రా చేసిన స్లిప్ కూడా దరఖాస్తు కి జత చేయాలి.
*విత్ డ్రా చేసిన స్లిప్పు లేకపోతే, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టుగా వచ్చిన ఎస్ఎంఎస్ ను సంబంధిత బ్యాంక్ అధికారులకు చూపించాలి.
*దరఖాస్తు స్వీకరించిన బ్యాంకు మీకు ఆ చిరిగిన, చెల్లిని నోటు స్థానంలో కొత్త కరెన్సీ నోటును ఇస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కొద్దిసేపట్లోనే పూర్తవుతుంది.
* ప్రతి బ్యాంకు శాఖలు చిరిగిన, మురికి అంటి చల్లని నోట్లను తిరస్కరించకుండా మార్పిడి చేయాలని ఏప్రిల్ 2017లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది.
*కరెన్సీ మార్పిడి చేయడానికి ఒక బ్యాంకు ఎక్కువ సమయం తీసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
*ఈ నిబంధనలు పాటించని బ్యాంకులు రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.