Ileana D’Cruz: ఆర్బి చౌదరి దర్శకత్వంలో పోతినేని రామ్ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా “దేవదాస్” లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా గోవా బ్యూటీ ఇలియానా.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఈ దెబ్బతో రెండో సినిమా పూరి దర్శకత్వంలో మహేష్ నటించిన “పోకిరి” లో నటించి ఇండస్ట్రీ హిట్ సాధించి… బ్లాక్ బస్టర్ సినిమాలకు హీరోయిన్ గా కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించి బిజీ హీరోయిన్ గా మారి… సౌత్ లో తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసుకుంది.
అనంతరం బాలీవుడ్ పై మోజు పడి సౌత్ సినిమా అవకాశాలను వదులుకున్న ఇలియానా అక్కడ ప్రారంభంలో .. వరుస ఆఫర్లు అందుకున్నా కానీ తర్వాత అక్కడ పరాజయాలు ఎదురు కావడంతో వచ్చిన అవకాశాలు మొత్తం కోల్పోయింది. ఇక ఇదే సమయంలో తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినా గాని అంతగా రాణించలేక పోయింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో కుర్రకారును ఉర్రూతలూగించే.. అందచందాలతో ఫోటో లు పెడుతూ … టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. తాజాగా రెడ్ బికినీ తో…టాప్.. కింద వేసుకుని ఇలియానా బ్యూటీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు షేర్ల తో దద్దరిల్లిపోతోంది. ఈ రెడ్ బికినీలో ఇలియానా ఇచ్చిన ఫోజుకి సోషల్ మీడియాలో నెటిజనులు చెప్పలేని భాషలో కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే రవితేజ నటిస్తున్న రామారావు అన్ డ్యూటీలో… ఓ స్పెషల్ సాంగ్ లో ఇలియానా నటించినున్నట్లు సమాచారం. కానీ హీరోయిన్ గా మంచి అవకాశం కోసం ఈ గోవా బ్యూటీ ఎదురుచూస్తూ ఉంది. మరి ఇలియానా చూపిస్తున్న అందాలకు ఏ డైరెక్టర్ ముందుకు వస్తాడో చూడాలి.