32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఎటిఎం లో బంగారం ఎలా పెడతారబ్బా, ఇదేం మాయాజాలం అనుకుంటున్నారా! బటన్ వొత్తు బంగారం పట్టు ప్రపంచం లోనే తెలిసారిగా హైదరాబాద్ లో

Share

Gold ATM Hyderabad: ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు మొత్తం మారిపోతున్నాయి. టెక్నాలజీ పుణ్యమా కావాల్సిన వస్తువులు ఆన్ లైన్ విధానం ద్వారా ఇంటికి చేరుకుంటున్నయి. తినే ఆహారం నుండి దైనిందిన జీవితంలో వాడే రకరకాల వస్తువులు అన్నీ కూడా ఆన్ లైన్ విధానం ద్వారా ఆర్డర్ చేసుకునే పరిస్థితులు. గతంలో ఏ అవసరం వచ్చినా షాపు వద్ద వెళ్లి కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇంకా డబ్బులు విషయానికి వస్తే బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకునేవాళ్లు. కానీ ఏటీఎంలు రావడంతో… ఖాతాదారులకు బ్యాంక్ అవసరాలు చాలా వరకు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆఖరికి బంగారం కూడా షాపు వద్దకు వెళ్లి కొనుక్కోకుండానే.. ఏటీఎంలో పొందుకునే అవకాశం ఇండియాలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.

Gold ATM Hyderabad
India’s first Gold ATM in Hyderabad

మేటర్ లోకి వెళ్తే గోల్డ్ ఏటీఎం మిషన్ లు హైదరాబాదులో ఆవిర్భవించాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ రకమైన గోల్డ్ ఏటీఎం మిషన్లు లేవు. ఫస్ట్ టైం బంగారు ప్రియుల కోసం గోల్డ్ సిక్క సంస్థ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ గోల్డ్ ఏటీఎంలో డబ్బులు చెల్లిస్తే దానికి తగ్గ గోల్డ్ పొందుకోవచ్చు. ముందుగా ఈ గోల్డ్ ఏటీఎంలో 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఎన్ని గ్రాములు కావాలో ఆ  ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ క్రమంలో క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లు ద్వారా సదురు అమౌంట్… ఆ ఏటీఎంలో చెల్లించి.. మనం ఎంచుకున్న గోల్డ్ పొందుకోవచ్చు. మామూలుగా ఏటీఎంలో డబ్బులు తీసుకున్న మాదిరిగానే ఇక్కడ ఈ గోల్డ్ ఏటీఎంలో… బంగారం పొందుకోవచ్చు. అయితే మనకి బంగారం.. కాయిన్ రూపంలో లభిస్తోంది. ఈ క్రమంలో బంగారం పొందుకున్నాక ఏటీఎం నుండి రిసిప్ట్ కూడా వస్తది. దానిలో పొందుకున్న బంగారము యొక్క… లావాదేవీలు అన్నీ కూడా వివరంగా ఉంటాయి.

Gold ATM Hyderabad
World’s first instant gold ATM launched in Hyderabad

ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ ధరలు బట్టి ఈ గోల్డ్ ఏటీఎం మిషన్లలో.. బంగారం పొందుకోవచ్చు. పెద్ద పెద్ద షాపులలో గ్రాములలో అతి తక్కువ బంగారం కొనుక్కోవాలి అంటే కొద్దిగా మొహమాటస్తులు..ఉండేవాళ్ళు…ఈ విధానం ద్వారా పొందుకోవటానికి గోల్డ్ సిక్క వాళ్లు ఈ గోల్డ్ ఎటిఎం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ గోల్డ్ ఏటీఎం మిషన్ లావాదేవీలకు సంబంధించి ప్రత్యేకంగా సర్వర్ కూడా ఏర్పాటు చేయటంతో అన్ని ట్రాన్సాక్షన్స్…కి సంబంధించిన డేటా చాలా భద్రంగా ఉంటుంది. ట్రాకింగ్ సిస్టంతో పాటు సెక్యూరిటీ సిస్టం కూడా చాలా పగడ్బందీగా ఏటీఎం నిర్వహకులు అందుబాటులో తీసుకొచ్చారు. ఏదైనా సమస్య వచ్చినా గాని సదరు గోల్డ్ ఎటిఎం వద్దనే టెక్నికల్ టీం కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గోల్డ్ ఏటీఎంలో ఐదు కేజీల బంగారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. దీని ఖరీదు వచ్చేసరికి దాదాపు రెండున్నర కోట్లు. ఈ క్రమంలో దొంగల బెడద లేకుండా కూడా ప్రతిష్టమైన భద్రత వలయాల మధ్య ఈ గోల్డ్ ఎటిఎంలు ఏర్పాటు చేయడం జరిగింది.

World's first instant gold ATM launched in Hyderabad
World’s first instant gold ATM launched in Hyderabad

హైదరాబాద్ లో బేగంపేట్ ప్రాంతంలో ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే.. ఇండియాలో మొదటి గోల్డ్ ఏటీఎం ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా హైదరాబాద్ లో మరికొన్ని ప్రాంతాలలో ఈ గోల్డ్ ఏటీఎం మిషన్లు పెట్టడానికి నిర్వాహకులు రెడీ అవుతున్నారు. మొత్తం సక్సెస్ అయితే ఇండియావ్యాప్తంగా దాదాపు 3,000 గోల్డ్ ఏటీఎం మిషన్స్ పెట్టడానికి గోల్డ్ సిక్క సంస్థ వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా సౌత్ ఇండియాలో సక్సెస్ అయిన తర్వాత నార్త్ ఇండియాలో ఈ గోల్డ్ ఏటీఎంలు  అందుబాటులోకి తీసుకొచ్చే ప్లానింగ్ చేస్తున్నారు. బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతుంటాయి. అయితే ఈ  టైం ఏటీఎంలలో బంగారం ధర ఏరోజు.. ఎంత ఉంటుందో దాన్నిబట్టి… డబ్బులు చెల్లించే రీతిలో.. ఎప్పటికప్పుడు బంగారం ప్రైజ్ మనీ అప్ డేట్ చేసే టెక్నాలజీ కూడా అమర్చారు.

Picture of the recently launched Gold ATM in Hyderabad
Picture of the recently launched Gold ATM in Hyderabad

లండన్ బులియన్ ఎక్స్చేంజ్ మార్కెట్ బట్టి ఈ బంగారం యొక్క ధరనీ గోల్డ్ సిక్కా నిర్వాహకులు.. నిర్ణయిస్తున్నారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడి డబ్బులు చెల్లించాక గోల్డ్ మిషన్ నుండి రాకపోతే.. మనం చెల్లించిన డబ్బులు తిరిగి మన అకౌంట్ లోనే 24 గంటలలో పడే రీతిలో సాఫ్ట్వేర్.. అమర్చడం జరిగింది. ప్రతినెల గోల్డ్ కోసం డబ్బులు సేవింగ్ చేయాలనుకునే దిగువ మధ్యతరగతి లాంటివాళ్ళకి ఈ గోల్డ్ ఏటీఎం విధానం ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. 24/7 ఈ గోల్డ్ ఏటీఎం అందుబాటులో తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేట్ వద్ద ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన.. మొదటి గోల్డ్ ఏటీఎం ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే హైదరాబాదులో కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశాక.. కరీంనగర్ ఇంకా వరంగల్ ప్రాంతాలలో కూడా ఈ ఏటీఎంలు అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు.

Trending: ఎల్‌జి‌బి‌టి స్వలింగ సంపర్కులు UPSC పరీక్ష రాసి ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారి కాగలరా?


Share

Related posts

ఆ తెలంగాణా మినిస్టర్ పై కోపంగా ఉన్న కే‌సి‌ఆర్ – ఛాంబర్ లో క్లాసు ??

sridhar

పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి టైటిల్ ఫిక్స్.. ఈ ఐడియా త్రివిక్రం దే అంటున్నారు ..?

GRK

వంటల్లో ఆరితేరిన సమంత.. ఉపాసనకు ఆ కాఫీ బాగా నచ్చేసిందట!

Teja