Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ కంప్లీట్ అయ్యి నెల రోజులు గడవక ముందే సీజన్ సిక్స్ గురించి షో నిర్వాహకులు చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. గత సీజన్ లకు భిన్నంగా 24 గంటలు హౌస్ లో ఏం జరుగుతుంది..? ఏడు రోజులు బిగ్ బాస్ ఆడియెన్స్ కి చూపించడానికి.. ఓటిటీలో ప్రసారం చేస్తున్నట్లు.. డిస్నీ హాట్ స్టార్(Disney Hotstar) షో నిర్వాహకులతో పాటు నాగార్జున అధికారికంగా మీడియా ముందు ప్రకటించడం తెలిసిందే. ఈ తరుణంలో నెక్స్ట్ సీజన్ కి కూడా తానే హోస్ట్ గా చేస్తున్నట్లు నాగార్జున ఆ సమయంలో ప్రకటించడం జరిగింది. దాదాపు మొదటి 2 సీజన్లు మినహా మిగతా మూడు సీజన్లకు నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా చేయడం జరిగింది. నాగార్జున యాంకరింగ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. గతంలో “మీలో ఎవరు కోటీశ్వరుడు”(MEK) వంటి గేమ్ షోకి హోస్ట్ గా చేసి అప్పటినుండి టీవీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో నాగార్జున గత మూడు సీజన్ ల నుండి హోస్ట్ గా రాణిస్తూ మంచి ఎంటర్ టైన్ చేస్తున్నారు. ముక్యంగా వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ లో సభ్యులకు క్లాసులు ఇస్తూ వార్నింగ్ లు ఇవ్వడం.. మరోపక్క.. పొగడాల్సిన సమయం లో పొగడ్తలతో.. రాణిస్తూ ఇంటి సభ్యుల నీ సరైన రీతిలో డీల్ చేసే విధానం చాల బాగుంటుంది. దీంతో నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ వరకు భారీ ఎత్తున టిఆర్పి రేటింగులు రావడం కామన్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఈ సారి సీజన్ సిక్స్ కి షో నిర్వాహకులు నాగార్జున తో పాటు.. మరొక టాప్ యాంకర్ ని తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే అతను మరెవరో కాదు రానా(Rana) దగ్గుబాటి. గతంలో టెలివిజన్ చానల్స్ లో…టాకీ షోలు చేస్తూ… చాలా మందిని చాలా సరదాగా ఇంటర్వ్యూ.. చేయడం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ సెలబ్రిటీలను హీరోలను దర్శకులను.. హీరోయిన్ల ను తనదైన శైలిలో రానా.. ఇంటర్వ్యూ చేసి టీవీ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయటం జరిగింది.
దీంతో సీజన్ సిక్స్ కోసం…షో నిర్వాహకులు… కీలక సమయంలో రానాతో .. యాంకరింగ్ చేయించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం నాగార్జున కంటే డబల్ అమౌంట్ రానాకి రెమ్యూనరేషన్ గా ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రానా కూడా చాలా సానుకూలంగా ఉన్నట్లు.. బయట సినిమా రంగం పరిస్థితి చూస్తే ఒక పక్క బాధ మరోపక్క సినిమా థియేటర్ల గొడవ ఉండటంతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఓటిటికి హోస్ట్ గా నాగార్జునతో పాటు చేయడానికి రానా రెడీ అయినట్లు..టాక్ సరికొత్తగా వినబడుతోంది.