ట్రెండింగ్

Uttar Pradesh: యూపీలో జరుగుతున్నపెళ్లి వేడుకలలో వింత సంఘటనలు..!!

Share

Uttar Pradesh: మానవ జీవితంలో పెళ్లి అనేది కీలకమైన ఘట్టం అని అందరికి తెలుసు. ప్రతి మనిషి జీవితంలో జరిగే ఈ వేడుకను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఎటువంటి మతానికి.. కులానికి చెందిన వారైనా గానీ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు… సాంప్రదాయాలు పాటిస్తారు. ముఖ్యంగా పెళ్ళి కొడుకుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లికూతురు బంధువులు పెళ్ళికొడుకుకి అదేవిధంగా పెళ్ళికొడుకు బంధువులకు రాచమర్యాదలు ఎక్కడ తగ్గకుండా చేస్తూ ఉంటారు. మన దేశంలో కూడా వివాహం విషయంలో పెళ్లి కూతురు బంధువులు పెళ్ళికొడుకుకి మంచి గౌరవం అందిస్తారు. కానీ ఇటీవల మాత్రం జరుగుతున్న పెళ్ళిళ్ళు.. జరుగుతున్న తీరు మనుషులకి షాక్ కి గురి చేస్తున్నాయి.

Groom Garlands Bride Slaps Man On Stage At Hamirpur
Groom Garlands Bride Slaps Man On Stage At Hamirpur

ఈ తరహాలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో హామిర్ పూర్ లో జరిగిన పెళ్లి వేడుకలో మెడలో దండ వేస్తున్న వరుడిని .. పెళ్లి కూతురు చెంప చెల్లుమనిపించింది. కళ్యాణ మండపంలో అందరు చూస్తుండగానే ఏకంగా మూడు నాలుగు సార్లు… పెళ్ళికొడుకు చెంపపై పెళ్లి కూతురు చేయి చేసుకోవడంతో.. పెళ్లి వేడుకకు వచ్చిన వాళ్లంతా షాక్ అయి పోయారు. పెళ్ళికొడుకు కి మైండ్ బ్లాక్ అయింది. అనంతరం కొట్టేసి ఆమె పెళ్లి మండపం నుండి దిగి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు చాలా రాష్ట్రాలలో ఇండియాలో పెళ్లి సమయంలో పెళ్ళికొడుకు లపై కాబోయే వధువు చెయ్యి చేసుకుంటున్న సంఘటనలు.. ఈమధ్య ఎక్కువైపోతున్నాయి. Furious Groom Violently Slaps Bride During Varmala Ceremony Over A Small Issue, Watch Viral Video | 👍 LatestLY

పెళ్లి కూతురు మాత్రమే కాదు పెళ్ళి కొడుకులు కూడా కళ్యాణ మండపం లోనే చేసుకోబోయే వధూవు పై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. పెళ్లి జరిగిన తరువాత.. వరుడు వధువు కి… స్వీట్ తినిపించాలని..అక్కడ సాంప్రదాయం. దీంతో వరుడు  స్వీట్ పెట్టగా.. వధువు సిగ్గుతో తలదించుకుంది. మరి ఒక్కసారిగా ఏమైందో ఏమో తెలియదు గానీ..చేతిలో ఉన్న స్వీట్ విసిరేసిన… వరుడు అందరూ చూస్తుండగానే పెళ్లి కూతురు పై చేయి చేసుకోవడం జరిగింది. ఆ వీడియో కూడా నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఈ రెండు సంఘటనలు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగాయి.


Share

Related posts

Heart: శీతాకాలానికి గుండె జబ్బులకు కారణమేంటి..!?

bharani jella

Bigg Boss 5 Telugu: ప్రియ ఆంటీ కి ఊహించని షాక్ ఇచ్చిన సన్నీ ఫాన్స్..??

sekhar

Balakrishna: బాలకృష్ణ పై మండిపడుతున్న ఏఆర్ రహమాన్ అభిమానులు..!!

sekhar