NewsOrbit
టాప్ స్టోరీస్ ట్రెండింగ్

భారత క్రికెటర్ల కొంపముంచిన అభిమాని..! మూడో టెస్టుకు ముందు ఆ అయిదుగురు ఐసోలేషన్ కు…

Share

కరోనా నేపథ్యంలో ఎన్నో కఠినమైన అంశాల మధ్య ప్రపంచ క్రికెట్ కొనసాగుతూ ఉంది. ‘బయో బబుల్’ అనే ఒక ప్రక్రియ నేపథ్యంలో క్రికెటర్లందరూ నిర్దేశిత ప్రదేశాన్ని వదిలి మ్యాచ్ జరిగే సమయంలో బయటకు వెళ్ళడానికి లేదు. అయితే తాజాగా భారత్ క్రికెట్ జట్టు సభ్యులైన రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, పృథ్వీ షా, నవదీప్ సైనీ లను క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు, బిసిసిఐ ఐసోలేషన్ లో ఉంచారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగా వారు టీం తో కాకుండా విడిగా ప్రయాణిస్తారు… ప్రాక్టీస్ కూడా వీరు ఐదుగురు విడిగా చేస్తారు…

 

వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఈ అయిదుగురు భారత్ క్రికెట్ జట్టు సభ్యులు ఒక రెస్టారెంట్ కు వెళ్ళాడు. అయితే అక్కడ భారత దేశానికి చెందిన ఒకతను వారిని చూసి ఉత్కంఠకు లోనయ్యాడు. వారికి తెలియకుండానే హోటల్లో వారు తిన్న దానికి బిల్ కట్టాడు. ఇక భోజనం పూర్తి చేసుకున్న ఐదుగురు క్రికెటర్లు ఒక అభిమాని తమ బిల్ కట్టాడు అని తెలిసి అతనికి డబ్బులు ఇవ్వబోతే వద్దు అన్నాడు. వారు ఎంత చెప్పినా కానీ అతను తీసుకోలేదు. ఇక చివరికి అతనితో ఫోటోలు దిగి వీరు బయలుదేరారు.

ఈ విషయం మొత్తాన్ని అతను తన ట్విట్టర్ అకౌంట్లో వ్రాశాడు. అయితే అది కాస్త పెద్ద రచ్చ అయిపోయింది. యూకే కొత్త కరుణ వైరస్ సిడ్నీ నగరం లోకి ప్రవేశించింది అని తెలిసిన తర్వాత కూడా కఠినమైన ఆంక్షలు మధ్య క్రికెట్ నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా మొగ్గుచూపింది. ఇలాంటి సమయంలో భారత క్రికెటర్లు రెస్టారెంట్ కు వెళ్లారు. అయితే వారు అన్ని నిబంధనలు పాటిస్తూ అన్ని అనుమతులు తీసుకుని రెస్టారెంట్ కు వెళ్లాలని టీం యాజమాన్యం చెప్పింది.

కానీ వారి బిల్ కట్టిన అభిమాని మాత్రం ఎక్కువ ఉద్వేగానికి లోనయి తన ట్విట్టర్ అకౌంట్ లో క్రికెటర్లలో ఒకరు తనను హత్తుకున్నారు అని వ్రాశాడు. దీంతో అది కాస్త బయో బబుల్ నిబంధనలను మీరునట్లు అయింది. వెంటనే ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్ కు తరలించారు. ఇక అసలు విషయం ఏమిటంటే… తర్వాత సదరు అభిమాని తాను అలా ఉద్వేగానికి లోనయి రాశానని… ఎవరు అతని హగ్ చేసుకోలేదని వివరించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించారని బయట వ్యక్తితో సన్నిహితంగా ఉన్నారని ఈ ఐదుగురిని ఐసోలేషన్ లో ఉంచారు. ఇక వారు తర్వాతి టెస్ట్ ఆడేది కూడా అనుమానమే అని కొన్ని వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

అధికారులకు చుక్కలు చూపించిన దీపిక… ఆ చాట్ నిజమేనట?

Teja

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రాబోయే రోజుల్లో రవితో ఆ కంటెస్టెంట్ కి మధ్య అతి పెద్ద గొడవ..!!

sekhar

డైనోసార్ గుడ్లును ఎప్పుడైన చూశారా ?

Teja