Indigo airlines : ఏ మనిషైనా ఎక్కడ పుడతాడు.. భూమి మీద ఏదో మూలన జన్మిస్తాడు.. కానీ ఈ బుడ్డది మాత్రం చాలా స్పెషల్.. ఏకంగా గాల్లో తేలుతూ విమానంలో జన్మించింది.. తాజాగా ఇండిగో ఫ్లైట్ లో ఓ మహిళ పాపకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారికంగా వెల్లడించింది..
బెంగళూరు నుంచి జైపూర్ వెళ్తున్న ఫ్లైట్ లో ఓ మహిళకు అనుకోకుండా నొప్పులు రావడంతో.. ఫ్లైట్ లో ఉన్న డాక్టర్ సాయంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఫ్లైట్ జైపూర్‌కు చేరుకోగానే సిబ్బంది వెంటనే అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించారు.. అయితే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది.. మామూలుగా ఇలాంటి సన్నివేశాలను సినిమాలలో మాత్రమే చూస్తూ ఉంటాము.. అయితే ఇది నిజజీవితం లోనే జరిగింది..