Vasantha Kokila: సూపర్ టాలెంటెడ్ నటుడు బాబీ సింహ నటిస్తున్న చిత్రం వసంత కోకిల.. కరిష్మా పర్దేషి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు మేకర్స్..!!

తెలుగు, తమిళం, కన్నడ భాషలలో రూపొందుతున్న త్రిభాషా చిత్రమిది. నీటిలో ఉన్న బాబీని చూసేందుకు కరిష్మా వస్తుంది. అతను కదలక పోవడంతో తన నోటితో ఊపిరి అందిస్తుంది. దీంతో బాబీ కి తన గతం గుర్తుకు వస్తుంది.. గతంలో తన ప్రేమ కోసం పోరాటం చేసిన సంఘటనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ టీజర్ తో సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది.. ఈ చిత్రానికి రమణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్ఆర్టి ఎంటర్టైన్మెంట్ పై, ఎం.ఎఫ్ఎఫ్ పతాకాలపై నిర్మిస్తున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని రామ్ తాలూరి నిర్మిస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సింహాసనం శ్రీదేవి నటించిన ఈ సినిమా టైటిల్ ను ఎంచుకున్నారు. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.