NewsOrbit
Cricket ట్రెండింగ్

IPL Dot Ball Tree: బీసీసీఐ భారీ వ్యూహం…ప్రతి డాట్ బాల్ తో మనందరికీ అద్భుతమైన బహుమతి…వేలు ఖర్చుపెట్టిన దొరకని గిఫ్ట్!!

IPL Dot Ball Tree BCCI partners with Tata companies in IPL Playoffs as part of a green initiative
Share

IPL Dot Ball Tree: ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంది మే 25న జరగనున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. అయితే ప్లేఆఫ్ మ్యాచులు మొదలైన దెగ్గరినుంచి మీ బుల్లి తెర మీద స్కోర్ వొచ్చే చోటు భారీ చెట్లు మొలుస్తున్నాయి గమనించారా? అవును, ప్రతి డాట్ బాల్ కి సున్నా అని ఉండాల్సిన చోట చెట్టు బొమ్మ కనపడుతుంది…ఇది బీసీసీఐ చేసిన పఅద్భుతమైన ప్లాన్.

IPL Dot Ball Tree BCCI partners with Tata companies in IPL Playoffs as part of a green initiative
IPL Dot Ball Tree BCCI partners with Tata companies in IPL Playoffs as part of a green initiative

BCCI’s Green Initiative- ఇదంతా గ్రీన్ ఇనిషియేటివ్ లో భాగం

గుజరాత్ కి చెన్నై కి మధ్య జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచులో మొత్తం 81 డాట్ బాల్స్ వేయబడ్డాయి. అయితే ఈ మ్యాచులో డాట్ బాల్ కి స్కోరులో సున్నా ఉండాల్సిన చోట బదులుగా పచ్చని చెట్లు కనపడేసరికి చూసే ప్రేక్షకులకు అర్ధం అవ్వలేదు. మొదట ఏదో తప్పిదం వలన ఇలా జరిగి ఉండవొచ్చు అని చాలా మంది అనుకున్నారు.

అయితే అసలు విషయం ఏమిటీ అని కామెంటేటర్ హర్ష భోగ్లే చెప్పేవరకు చాలా మందికి నిజం తెలియలేదు. ఇంతకీ చెట్లు ఎందుకు స్కోర్ బోర్డు లో కనపడుతున్నాయి అంటే ఇది బీసీసీఐ టాటా కంపెనీల తో చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ప్లేఆఫ్ మ్యాచులలో మనం చూసే ప్రతి డాట్ బాల్ కి టాటా గ్రూప్ కంపెనీల తరుపునుండి 500 మొక్కలు నాటబడతాయి. అంటే మొదట జరిగిన క్వాలిఫైయర్ ఆటలో మొత్తం 81 డాట్ బాల్స్ కి సుమారు 42000 వేల మొక్కలు నాటింది టాటా సంస్ధ. ఈ లెక్క ప్రకారం ఐపీఎల్ 2023 అయిపోయే సరికి 1 లక్షకు పైగా మొక్కలు నాటాల్సి వస్తుంది టాటా సంస్ధ. బీసీసీఐ చేసిన ఈ పనిని చాలా మంది ప్రశంసిస్తున్నారు, మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా మనకు దొరకని ఒక అద్భుతమైన బహుమతి ఇది…పర్యావరణం పచ్చని ప్రకృతి కోసం బీసీసీఐ చేసిన ఈ భారీ వ్యూహం మెచ్చుకోకుండా ఉండలేం మరి.


Share

Related posts

Bigg Boss 5 Telugu: హౌస్ లో తానే గుంటనక్క అని ఒప్పేసుకున్న యాంకర్ రవి..!!

sekhar

Contraceptive Pill: గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా..!? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!!

bharani jella

Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం ప్రత్యేకం.. దేవి నిర్ణయానికి షాక్ అయిన మాధవ్..! 

bharani jella